ఈ టాప్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? | The ocean is everything I want it to be says top heoriene | Sakshi
Sakshi News home page

ఈ టాప్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Published Mon, Dec 26 2016 9:34 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

ఈ టాప్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? - Sakshi

ఈ టాప్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

హైదరాబాద్: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఈ నటిని గుర్తు పట్టారా?..అదేనండి అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అందాల భామ సమంత. తనకు ఉండాలనుకుంటున్న లక్షణాలు అన్ని సముద్రానికున్నాయని చెబుతోంది ఈ సుందరి. అవేంటంటే..అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్ఛ అంటోంది ఈ ముద్దు గుమ్మ. సముద్రంలో వెనకవైపు నుంచి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసి తన అభిమానులకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపింది.

2017 జనవరి 29న నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకటి రెండు తమిళ సినిమాలు అంగీకరించిందన్న టాక్ వినిపించినా.. షూటింగ్ లకు మాత్రం వెళ్లటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement