akkineni nagachaitanya
-
పెళ్లి తర్వాత అక్కినేనివారి కోడలు ఫోటోషూట్.. బంగారంలా మెరిసిపోతున్న శోభిత!
-
మల్లన్న సన్నిధిలో కొత్త జంట
-
నాగచైతన్య- శోభితల పెళ్లి.. చైతూ కోరడం వల్లే అలా: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత- నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వచ్చేనెల 4వ తేదీన హైదరాబాద్‌లోనే వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు. పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు ఆయన వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ..'ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మందిని పిలవాలని నిర్ణయించాం. స్టూడియోలో అందమైన సెట్లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారని' తెలిపారు.గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్లో అభినందించినట్లు నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పినట్లు తెలిపారు. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నాగ్ అన్నారు. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించారు. -
వెంకీ మామ : మూవీ రివ్యూ
-
బాహుబలి టీమ్‌లో...
అక్కినేని నాగచైతన్య ‘బాహుబలి’ టీమ్‌లో వర్క్ చేశారట! నిజమా... ‘బాహుబలి’ రెండు భాగాల్లో చైతూ ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా? అయితే... చైతూ వర్క్ చేసింది యాక్టర్‌గా కాదు. మరేం చేశారు? అంటే... డ్రోన్ ఆపరేటర్‌గా వర్క్ చేశారట! చైతూ హీరోగా వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన సినిమా ‘యుద్ధం శరణం’. వచ్చే నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ డ్రోన్ ఆపరేటర్‌గా నటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ‘బాహుబలి’కి వర్క్ చేసే డ్రోన్ ఆపరేటర్‌గా చైతూ కనిపిస్తారట. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్. ఆయనే ఇంట్రడక్షన్ సీన్స్‌లో హీరోని ‘బాహుబలి’ డ్రోన్ ఆపరేటర్‌గా చూపిస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చారట. అదీ మేటర్!! కృష్ణ ఆర్.వి. మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా, రావు రమేశ్, మురళీ శర్మ, రేవతి ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాకు రజనీ కొర్రపాటి నిర్మాత. -
ఈ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా?
హైదరాబాద్: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఈ నటిని గుర్తు పట్టారా?..అదేనండి అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అందాల భామ సమంత. తనకు ఉండాలనుకుంటున్న లక్షణాలు అన్ని సముద్రానికున్నాయని చెబుతోంది ఈ సుందరి. అవేంటంటే..అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్ఛ అంటోంది ఈ ముద్దు గుమ్మ. సముద్రంలో వెనకవైపు నుంచి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసి తన అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. 2017 జనవరి 29న నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకటి రెండు తమిళ సినిమాలు అంగీకరించిందన్న టాక్ వినిపించినా.. షూటింగ్ లకు మాత్రం వెళ్లటం లేదు.