నాగచైతన్య- శోభితల పెళ్లి.. చైతూ కోరడం వల్లే అలా: నాగార్జున | Akkineni Nagarjuna Responds On Naga Chaitanya Marriage With Sobhita Dhulipala, Deets Inside | Sakshi
Sakshi News home page

Akkineni Nagarjuna: చైతూ పెళ్లి పనులు.. వాళ్లే చూసుకుంటున్నారు: నాగార్జున

Published Fri, Nov 22 2024 12:26 PM | Last Updated on Fri, Nov 22 2024 12:54 PM

Akkineni Nagarjuna Responds On naga Chaitanya Marriage with Sobhita

అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న శోభిత- నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. వచ్చేనెల 4వ తేదీన హైదరాబాద్‌లోనే వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులపై అక్కినేని నాగార్జున స్పందించారు. పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు ఆయన వివరించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కామెంట్స్ చేశారు.

నాగార్జున మాట్లాడుతూ..'ఈ ఏడాది మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వీరి పెళ్లి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకు చాలా ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మందిని పిలవాలని నిర్ణయించాం. స్టూడియోలో అందమైన సెట్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారని' తెలిపారు.

గూఢచారి సినిమా చూసి శోభితను ఫోన్‌లో అభినందించినట్లు నాగార్జున వెల్లడించారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పినట్లు తెలిపారు. వైజాగ్‌ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని నాగ్ అన్నారు. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని కాబోయే కోడలిపై ప్రశంసలు కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement