సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతోందని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు.