ఈసారి శివరాత్రి శుక్రవారం పడింది. దీంతో ఈసారి థియేటర్లలో 'గామి', 'భీమా' లాంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు 'ప్రేమలు' అనే డబ్బింగ్ బొమ్మ కూడా థియేటర్లలోకి వచ్చేసింది. ఇదే టైంలో ఓటీటీల్లోనూ పలు మూవీస్ రిలీజైపోయాయి. 'హనుమాన్' కూడా స్ట్రీమింగ్ అయిపోతుందన్నారు కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఓ రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్ మాత్రం ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ)
సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ సినిమా 'ఊరి పేరు భైరవకోన'. చాలా కాలం షూటింగ్ జరుపుకొని, వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ ఉన్నంతలో డీసెంట్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇది కేవలం 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 అన్నారు కానీ ప్రైమ్‌లోకి వచ్చి చిన్న షాక్ ఇచ్చింది.
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'మేరీ క్రిస్‌మస్'. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిందీ-తమిళంలో మాత్రమే రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఇప్పుడు ఇదే భాషల్లో స్ట్రీమింగ్ అయిపోతోంది. మరోవైపు ఫిబ్రవరిలో రిలీజైన మలయాళ హిట్ బొమ్మ 'అన్వేషిప్పిన్ కండేతుమ్' అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులోకి వచ్చేసింది. ఇది మాత్రం తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. శివరాత్రికి రిలీజైన వాటిలో ఈ మూడు మాత్రమే ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. టైమ్ ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment