address to the nation
-
President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి
న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్‌ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భోగి, ఉత్తరాయణ పర్వదినాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలకు ఉత్తరాయణ, భోగి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజులు అందరికీ సంతోషాన్ని, శుభాలను కలుగజేయాలని, జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను’అని ఆయన ట్వీట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భోగి పండుగను, ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. -
ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ప్రేమ, దయతో మెలగాలని క్రిస్మస్ మనకు ప్రేరణనిస్తుందని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశ ప్రజలకు శనివారం ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం మానవాళి శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని రాష్ట్రపతి ఆ సందేశంలో తెలిపారు. ‘యేసుక్రీస్తు అందించిన కరుణ, త్యాగం అనే సందేశాన్ని ఈ రోజున మనం స్మరించుకుందాం. క్రిస్మస్ పండుగ ఒకరినొకరు ప్రేమ, దయతో మెలగడానికి స్ఫూర్తినిస్తుంది. క్రీస్తు యొక్క దైవిక బోధనలను మన జీవితంలో స్వీకరిద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆమె పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు’ అని తెలిపారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
Azadi ka Amrit Mahotsav: వీరుల త్యాగ ఫలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో సమర యోధులు సర్వస్వాన్ని ధారపోశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. వారి అమూల్య త్యాగాలను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ సరైన సందర్భమన్నారు. వారి స్ఫూర్తి గాథలను యువ తరానికి వినిపించి వారిలో దేశభక్తి, సేవా భావం, త్యాగ గుణం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఎన్నడూ మరవకూడదన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ధన్‌ఖడ్ ఆదివారం ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘క్రూరమైన బ్రిటిష్ వలస నుంచి దేశాన్ని విముక్తం చేసిన వీరుల ధైర్య సాహసాలు, త్యాగాలను పంద్రాగస్టు సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుని వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. నేటి భారతం అంతులేని శక్తి సామర్థ్యాలను కళకళలాడుతోంది. సర్వతోముఖ వృద్ధి పథంలో వడివడిగా పరుగులు పెడుతోంది. జాతి విలువలను, రాజక్యాంగ విలువలను సమున్నతంగా నిలిపేందుకు మరోసారి ప్రతినబూనుదాం. దేశ నిర్మాణ క్రతువుకు పునరకింతం అవుదాం’’ అంటూ పిలుపునిచ్చారు. -
సమున్నత భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసలైన శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ప్రపంచానికి భారత్ తోడ్పాటును అందించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. అణగారిన వర్గాలు, పేదలు, అవసరాల్లో ఉన్నవారి పట్ల భారత్ దయార్ధ్ర హృదయంతో మెలుగుతోందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఆమె రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 17 నిమిషాలపాటు ప్రసంగించారు. భారీ ఆర్థిక సంస్కరణలతోపాటు వినూత్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ‘‘సమున్నతంగా ఎదుగుతున్న నూతన భారత్‌ను ప్రపంచం అబ్బురంగా వీక్షిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశాం ‘‘భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు అంతర్జాతీయ నాయకులు, పాశ్చాత్య నిపుణులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్న భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా? అని అనుమానించారు. వారి అనుమానాలను మనం పటాపంచలు చేశాం. ఈ గడ్డపై ప్రజాస్వామ్యం కేవలం పురుడు పోసుకోవడమే కాదు, దివ్యంగా వర్థిల్లుతోంది. దినదిన ప్రవర్థమానమవుతోంది. దేశ భద్రత, ప్రగతి, సౌభాగ్యం కోసం సర్వశక్తులూ ధారపోస్తామని పౌరులంతా ప్రతిజ్ఞ చేయాల్సిన తరుణమిది. ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విధాన రూపకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనా మహమ్మారిపై భారత్ సాగించిన పోరాటాన్ని ప్రపంచమంతా హర్షించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం చేపట్టాం. కరోనా టీకాలను దేశీయంగానే తయారు చేసుకున్నాం. టీకా డోసుల పంపిణీలో 200 కోట్ల మార్కును గత నెలలోనే దాటేశాం. మహమ్మారిని నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాల కంటే భారత్ గొప్ప విజయాలు సాధించింది. ఇందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కరోనా వైరస్ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాలతో ఎన్నో దేశాలు సతమతమవుతుండగా, భారత్ వేగంగా కోలుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. అప్పుడే మన మనుగడకు అర్థం భవ్యమైన భారత్‌ను నిర్మించుకుంటేనే మన మనుగడ మరింత అర్థవంతంగా మారుతుంది. మాతృదేశం కోసం, తోటి పౌరుల ప్రగతి కోసం త్యాగాలు చేయాలన్న పెద్దల మాటను గుర్తుంచుకోవాలి. 2047 నాటికి గొప్ప భారత్‌ను నిర్మించబోతున్న యువతకు ఇదే నా ప్రత్యేక విజ్ఞప్తి. ప్రజాస్వామ్యం బాగా వేళ్లూనుకున్న దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించేందుకు చాలాకాలం పట్టింది. అందుకోసం వారు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, గణతంత్ర భారత్‌లో మొదటినుంచే వయోజనులందరికీ ఓటు హక్కు లభించింది. జాతి నిర్మాణంలో వయోజనులందరికీ భాగస్వామ్యం ఉండాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆర్థిక విజయంతో జీవితాలు సులభతరం మన దేశంలో స్టార్టప్ కంపెనీలు మంచి విజయం సాధిస్తున్నాయి. యూనికార్న్ కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం సంతోషకరం. మన పారిశ్రామిక ప్రగతికి ఇదొక ఉదాహరణ. ఈ క్రెడిట్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, విధాన రూపకర్తలకు చెందుతుంది. మన ఆర్థిక వ్యవస్థ వెలుగులీనడానికి స్టార్టప్ కంపెనీలు దోహదపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫిజికల్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అనూహ్యమైన వృద్ధి నమోదవుతోంది. కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితోనే ఇది సాధ్యమవుతోంది. మనం సాధిస్తున్న అభివృద్ధి సమీకృతంగా, అసమానతలను తగ్గించేలా ఉంటుండడం ముదావహం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. విధాన నిర్ణయాలు అమలు చేయాలి. జాతీయ విద్యా విధానం కూడా ఆ కోవలోనిదే. ఆర్థిక విజయం ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది. సొంతిల్లు.. ఇక ఎంతమాత్రమూ కల కాదు పేదలకు సొంతిల్లు అనేది ఇక ఎంతమాత్రం కలగా మిగిలిపోవడం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అది వాస్తవ రూపం దాలుస్తోంది. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి నీరందుతోంది. ప్రజలందరికీ.. ముఖ్యంగా పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక విధులను ప్రజలంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధితో ఆచరిస్తే మన దేశం ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఖాయం. ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో పనిచేయాలి. మనం స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారిని స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చింది. వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించిన దినం కేవలం మన ఒక్కరికే పండుగ రోజు కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ వేడుకే’’ అని రాష్ట్రపతి ముర్ము వివరించారు. భారత్ బహుమతులు యోగా, ఆయుర్వేదం యువత, రైతులు, మహిళలు దేశానికి కొత్త ఆశారేఖలు. ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో 14 లక్షల మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రీడాకారులు మన దేశం గర్వపడేలా రాణించారు. వారిలో చాలామంది అణగారిన వర్గాల నుంచి వచ్చినవారే. మన బిడ్డలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకొని మనమంతా కలిసి ప్రయాణం సాగించాలి. యోగా, ఆయుర్వేదం అనేవి ప్రపంచానికి భారత్ ఇచ్చి న విలువైన బహుమతులు. ప్రపంచమంతటా వాటికి ఆదరణ పెరుగుతోంది. -
Independence Day 2022:నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)తోపాటు, దూరదర్శన్ అన్ని చానళ్లలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమవుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఏఐఆర్ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ నెట్‌వర్క్‌ల ద్వారా రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుందని పేర్కొంది. ఒడిశాకు చెందిన ముర్ము జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
ఇది భారత శతాబ్దం
న్యూఢిల్లీ: మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ యువతను కోరారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయన్నారు. ‘కోవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువ త మూలాలను మరువరాదు’ అని కోరారు. ‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్ అన్నారు. ‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు. పరూంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. -
అందరూ వ్యాక్సిన్ తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19పై భారత్ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భారత ప్రజలు మొదట్నుంచి కఠినమైన జాగ్రత్తలు పాటిస్తూ, క్రమశిక్షణతో ఉంటూ అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరిగే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మోదీ ప్రసంగించారు. మన్ కీ బాత్ 75 భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేశ మన్‌కీ బాత్ కూడా 75 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమర యోధులు చేసిన త్యాగాలు పౌరులుగా మన బాధ్యతల్ని గుర్తు చేసి కర్తవ్యోముఖుల్ని చేస్తాయని మోదీ అన్నారు. ఆ పోరాట స్ఫూర్తి అభినందనీయం కరోనా వైరస్ బట్టబయలైన తొలి రోజుల్లో గత ఏడాది మార్చి 22న విధించిన జనతా కర్ఫ్యూ గురించి మోదీ మన్ కీ బాత్‌లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లాక్డౌన్ వంటివి కొత్త అయినప్పటికీ ప్రజలంతా సహకరించి దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించి ఫ్రంట్‌లైన్ సిబ్బంది మనసుల్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. ప్రజా మద్దతుతో ఏడాదిగా వైద్య సిబ్బంది అలుపెరుగకుండా కరోనాపై యుద్ధం చేస్తున్నారని , ప్రతీ పౌరుడి ప్రాణాలు కాపాడడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది అసలు వ్యాక్సిన్ వస్తుందో, రాదోనన్న సందేహాలు ఉండేవని, అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన దేశంగా భారత్ నిలవడం గర్వ కారణమని అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న మోదీ 100 ఏళ్లు పైబడిన వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్కి చెందిన 109 ఏళ్ల అమ్మ రామ్ దులాయి, ఢిల్లీలో 107 ఏళ్ల కేవల్ కృష్ణ, హైదరాబాద్‌కి చెందిన వందేళ్ల వయసున్న జై చౌదరి వంటివారు వ్యాక్సిన్లు తీసుకున్నారని, కరోనాపై పోరాటంలో విజయం సాధించాలంటే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని పిలుపు,నిచ్చారు. విజయవాడ వాసి ఆదర్శం ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పదకండ్ల వాహనాల తుక్కు నుంచి శిల్పాలు సృష్టిస్తున్నారు. అలా సృష్టించిన భారీ శిల్పాలు పబ్లిక్ పార్కులో ఏర్పాటు చేయగా ప్రజలు వాటిని ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో ఇదో వినూత్న ప్రయోగం. ఇందుకు నా అభినందనలు. ఇలాంటి కృషిలో పాల్గొనేందుకు మరింత మంది ముందుకురావాలి. అందరూ సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండండి. కరోనా నినాదాన్ని మరచిపోవద్దు’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి సాగు రంగం అత్యవసరంగా ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవసాయ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు రావాలన్నా, రైతుల ఆదాయం పెరగాలన్నా ఆ రంగంలో వినూత్న పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. సంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కొత్త ఆవిష్కరణలు జరగాలి’అని ప్రధాని అన్నారు. కేంద్రం గత ఏడాది తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది మంది రైతులు నవంబర్ నుంచి చేస్తున్న ఉద్యమం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగు చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలోకి కొత్తగా పెట్టుబడులు, ఆధునిక విధానాలు వస్తాయని, ఒకే దేశం ఒకే మార్కెట్ కారణంగా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది. -
అహింసాయుతంగా పోరాడండి
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసను నిత్య జీవితంలో అంతర్భాగంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందన్నారు. ‘ప్రజలే దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ‘దేశాభివృద్ధికి అంతర్గత భద్రత ఎంతో కీలకం. దేశ అంతర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది’ అని చెప్పారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్ ఎంతో తక్కువకాలంలోనే ఘన విజయం సాధించింది. సబ్సిడీపై వంటగ్యాస్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలను ప్రజలు తమవిగా చేసుకోవడం ద్వారా అవి విజయవంతమయ్యాయి’ అని అన్నారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అలంకారప్రాయంగా కాకుండా, ఆచరణాత్మకంగా ఉండాలని భావిస్తే మనం ఏం చేయాలి? ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను తప్పకుండా అనుసరించాలనేదే నా అభిప్రాయం’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. -
‘పరిమితం’.. దేశహితం
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు. కశ్మీరీల కలలకు రెక్కలు జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు. ‘సీడీఎస్’ రూపకల్పన.. త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. దేశంలోనే విహారం ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి. న్యూఢిల్లీ దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జనాభాను నియంత్రించాల్సిందే.. ‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’. ‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం ‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్‌ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్సీ చైర్మన్‌గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు. కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి ‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’ దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి.. ‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి. దేశం గొప్పగా మారాలంటే తప్పదు.. ‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే. ఆరేళ్లు.. ఆరు తలపాగాలు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్‌పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు. ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా... ► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు. ► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు. ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు. ► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్గార్డ్ల వందనం స్వీకరించారు ► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు. ► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు. ► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు. ► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. అమరవీరులకు సలాం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్ వందనం ఆసేతు హిమాచలం జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన భారీ త్రివర్ణం ముంబైలోని హిరానందాని గార్డెన్స్‌లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు తల్లీ భారతి వందనం మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్ -
7న జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు పూర్వాపరాలను వివరించడంతో పాటు ప్రధాని మరికొన్ని కీలక నిర్ణయాలను తన ప్రసంగంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. ప్రధాని ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో 7న జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. పీడీపీ సభ్యులు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని బీఎస్పీ సమర్ధించడం గమనార్హం. -
రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి సందేశం..
-
రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి సందేశం..
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో విద్యాభ్యాసం మొదలుపెట్టి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యున్నత శిఖరంగా భావించే రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసింది. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా ప్రణబ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు తనకు దేవాలయం వంటిదని, ఎప్పటికీ దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోవింద్ భవిష్యత్తులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తాను ఐదేళ్ల క్రితమే ప్రమాణం చేశాననీ, దేశానికి తాను చేసిన దానికంటే తనకు దేశమే ఎక్కువ ఇచ్చిందన్నారు. భారత్ అంటే భూభాగం మాత్రమే కాదని, భిన్న జాతులు, భిన్న అభిప్రాయాల కలయిక అని అభివర్ణించారు. ప్రభుత్వాలు పేదల ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజలంతా సహనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లపాటు రాజ్యాంగమే తనను నడిపించిందని ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శతాబ్దంలో భిన్నత్వంలో కొనసాగుతున్న జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల ప్రగతిపై చర్చ జరగాలన్నారు. సంక్షోభంలో ఉన్న సేద్యాన్ని లాభసాటిగా మార్చాలని, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలని సూచించారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో రాజ్యాంగమే తనకు పవిత్రగ్రంథంగా నిలిచిందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ప్రణబ్ ఆకాంక్షించారు. -
దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేసేవారినే ఎన్నుకోండి