
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ మ్యాజిక్ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్ చేశారు. చదవండి: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు..
#MerryChristmas🎄to all! Hope the magic of Christmas fills joy and laughter in our lives.May the holiday season recharge us for a great year ahead! pic.twitter.com/BC10I1b3rf
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2020
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని పంచండి. ఇవ్వడానికి, పంచుకునేందుకు ఇది అందమైన రోజు. అందరికి ప్రశాంతత, ప్రేమ, ఆనందాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. క్రిస్మస్ ట్రీ వద్ద కొడుకు గౌతమ్, కూతురు సితార దిగిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ అందరి తరపున నుంచి అల్లు శీరిష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కజిన్స్‌తో ఇలా సీక్రెట్ శాంటా ఆడినట్లు తెలిపారు. అటువంటి అద్భుతమైన ఆతిథ్యమిచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.
అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన క్రీస్తు జీవితం, సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇచ్చాయని, న్యాయమైన, సమగ్ర సమాజాన్ని నిర్మించటానికి అతని మార్గం చూపిస్తుందన్నారు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.
Merry Christmas from all of us! Played Secret Santa with cousins like every year. Thank you Charan & Upsi for being such amazing hosts. 🌲🎅🎄🎁 pic.twitter.com/6AqoUDbB20
— Allu Sirish (@AlluSirish) December 25, 2020
Merry Christmas to all of you! Spread some cheer... Let this be a beautiful day of giving and sharing. Wishing you all peace, love, and joy! ✨ pic.twitter.com/Z92nF6hC35
— Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2020
Wishing everyone a very #MerryChristmas🎄
— Jr NTR (@tarak9999) December 25, 2020
Merry Christmas!
— Narendra Modi (@narendramodi) December 25, 2020
The life and principles of Lord Christ gives strength to millions across the world.
May his path keep showing the way in building a just and inclusive society.
May everybody be happy and healthy.
Comments
Please login to add a commentAdd a comment