
విశ్వాసానికి ఏసు జీవితం స్ఫూర్తిదాయకం
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరులకు, రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏసు క్రీస్తును సంతోషంతో స్మరించుకునే రోజే క్రిస్మస్ అని, ఈ మానవాళికి ఏసు నేర్పిన ప్రేమ, సహనం, ఓదార్పునకు మనమంతా పునరంకితం కావాల్సిన సమ యం ఇది’ అని గవర్నర్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మానవాళిపై కరుణ ప్రసాదించాలని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సోదర సోదరీమణులతో కలసి ప్రార్థిస్తున్నానని అన్నారు. ‘ప్రేమ భావాన్ని, సేవాతత్ప రతను బోధించిన క్రీస్తు జన్మదినం యావత్ మానవ జాతికి సంతోషకరమైన రోజు’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.