
సాక్షి, తాడేపల్లి: రేపు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం జగన్.. ‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment