
సిడ్నీ: ఏదైనా వినూత్నంగా చేస్తేనే గుర్తింపు లభిస్తోంది. ఇలానే వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలిచింది ఓ ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి. అసలే క్రిస్మస్ పండుగ.. విమానాశ్రయంలో ప్రయాణీకులు అందరూ తమ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కడి ఉద్యోగిని తన చక్కటి స్వరంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ పాట పాడింది. దీంతో ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
నెకెర్ ఐల్యాండ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిచార్డ్ బ్రాన్సన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే 5.8 లక్షల మందికిపైగా వీడియోను చూడగా 67,000 మంది లైక్ కొట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఆనందకర వాతావరణాన్ని సృష్టించినందుకు నెటిజన్లు సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ప్రేమను అన్ని చోట్ల వ్యాప్తింపజేయాలని కొందరు కోరారు. మరికొందరేమో ఆమె స్వరం బాగుందని మెచ్చుకున్నారు.
ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment