
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు.