‘అమానా’ ఆత్మీయ సమావేశం | Muslim Community AMANA Formed In North America | Sakshi
Sakshi News home page

‘అమానా’ ఆత్మీయ సమావేశం

Published Sun, Aug 25 2019 8:02 PM | Last Updated on Sun, Aug 25 2019 8:13 PM

Muslim Community AMANA Formed In North America - Sakshi

అమెరికాలో ముస్లిం సామాజిక వర్గం నుంచి గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నా సరైన వేదిక లేకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్‌ ముస్లీం అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (AMANA) పేరిట ఆత్మీయ సమావేశాన్ని జరుపుకున్నారు. ముస్లిం కుటుంబాలకు ఒక వేదిక లేకపోవడం.. వారి ఆధ్యాత్మిక అవసరాలకు అంతర్జాతీయ ముస్లిం సమాజంలో ఒకరుగా కలిసిపోయినా.. తాము పుట్టిన పెరిగిన ఆంధ్రప్రదేశ్‌ మూలాలను గుర్తు పెట్టుకుని అనుసంధానం అవడానికి, తెలుగు వారందరితో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిలో పాలు పంచుకోవడానికి ఒక వేదిక అవసరాన్ని గ్రహించి ‘అమానా’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

స్థానిక అలెన్ లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసం లో దాదాపు 15 ముస్లిం కుటుంబాలు సమావేశమై.. ఆంధ్ర ప్రదేశ్ ముస్లింల ప్రాతినిధ్యం గురించి, తెలుగు సమాజంలో మమేకవ్వడం.. అమెరికాలో నివసిస్తున్న ఆంధ్ర ముస్లింలను ఒక వేదిక మీదకు తీసుకురావడం.. వారి సామాజిక, సాంఘిక అవసరాలలో తోడ్పాటు అందించడం.. గురించి చర్చించుకున్నారు. ఈ సమావేశాం లో డాక్టర్ అబ్దుల్ రహమాన్ తో పాటు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, మహమ్మద్ ఇక్బాల్ గగ్గుతురు,  అక్బర్ సయ్యద్, షాజహాన్ షేక్, మస్తాన్ షేక్, షఫీ మహమ్మద్, ముజాహిద్ షేక్, ఫైజ్ షేక్, కాలిఫోర్నియా నుంచి అబ్దుల్ ఖుద్దూస్, జాకిర్ మహమ్మద్ మరియు నసీం షేక్ పాల్గొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement