జమాతే ఇస్లామీ నేతకు మరణశిక్ష | Riots in Bangladesh after court sentences Jamaat-e-Islami leader to death | Sakshi
Sakshi News home page

జమాతే ఇస్లామీ నేతకు మరణశిక్ష

Published Wed, Sep 18 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

జమాతే ఇస్లామీ నేతకు మరణశిక్ష

జమాతే ఇస్లామీ నేతకు మరణశిక్ష

ఢాకా: ‘మీర్‌పూర్ కసాయి’గా పేరుమోసిన జమాతే ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ ముల్లాకు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించింది. 1971 నాటి యుద్ధనేరాలపై మంగళవారం ఈ తీర్పునిచ్చింది. 8 నెలల కిందట ప్రత్యేక ట్రిబ్యునల్ అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, బంగ్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ముజామ్మెల్ హుస్సేన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ముల్లా దాఖలు చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  కాగా, తీర్పును వ్యతిరేకిస్తూ జమాతే ఇస్లామీ బుధ, గురువారాల్లో 48 గంటల దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement