ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎనిమిది మంది విద్యార్థులకు మరణ శిక్ష, మరో 13 మందికి జీవిత ఖైదు విధించారు. బంగ్లాదేశ్లోని ఛాత్ర లీగ్ కార్యకర్తలుగా ఉన్న వీరందరికీ పాత ఢాకాలో ఏడాదిక్రితం బిశ్వజిత్ దాస్ అనే ఓ టైలర్ను చంపిన కేసులో శిక్షలు పడ్డాయి. నేర తీవ్రత దృష్ట్యా ఇంత ఎక్కువ శిక్ష విధిస్తేనే న్యాయం జరుగుతుందని కోర్టు భావించినట్లు న్యాయమూర్తి నిజాముల్ హక్ వ్యాఖ్యానించారని అక్కడి మీడియా తెలిపింది.
నేరం పట్టపగలు జరిగింది తప్ప చీకట్లో ఎవరికీ తెలియకుండా జరిగినది కాదని, అది చాలా దారుణమైన హత్య అని కోర్టు వ్యాఖ్యానించింది. గత సంవత్సరం ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసిన సమయంలోనే ఇది జరిగింది. బిశ్వజీత్ హత్యకేసు చాలా సున్నితమైనదని, ఇది మిగిలిన కేసుల కంటే విభిన్నమైనదని అన్నారు. ఇంతకీ మరణశిక్ష పడిన ఎనిమిది మందిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. అలాగే జీవితఖైదు పడిన 13 మందిలో 11 మంది కూడా పరారీలోనే ఉన్నారు. వీళ్లలో చాలామంది జగన్నాథ్ యూనివర్సిటీ విద్యార్థులు. బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ అనేది అవామీ లీగ్ అనుకూల విద్యార్థి విభాగం. డిసెంబర్ 9వ తేదీన బిశ్వజీత్ తన దుకాణానికి వెళ్తుండగా విద్యార్థులు అతడిని వెంబడించి తీవ్రంగా కొట్టి, పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు.
ఎనిమిది మంది విద్యార్థులకు మరణ శిక్ష
Published Thu, Dec 19 2013 10:41 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
Advertisement