
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు.