బడా బిలియనీర్కు ఉరిశిక్ష
టెహ్రాన్: అవినీతికి పాల్పడిన ఆరోపణల కింద ఇరాన్కు చెందిన ప్రముఖ బిలియనీర్కు ఉరి శిక్ష విధించారు. త్వరలో ఆయనను ఉరి తీయనున్నారు. ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన కంపెనీల ద్వారా అధికమొత్తంలో అక్రమంగా చమురు అమ్మకాలకు పాల్పడినట్లు బాబక్ జంజానీ అనే ఓ బడా వ్యాపార వేత్తపై ఆరోపణలు వచ్చాయి. ఈ చమురు స్కాంలో కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. భారీ మొత్తంలో ఆర్థికపరమైన మోసాలకు పాల్పడినట్లు కూడా తెలిసింది.
అక్రమంగా చమురును విక్రయించి ప్రభుత్వ ఖజానా కాజేసినందుకు మరో ఇద్దరికి కూడా మరణ శిక్ష విధించారు. దీంతో అతడిని పోలీసులు 2013 డిసెంబర్ నెలలో అరెస్టు చేశారు. కాగా, ఈ ఆరోపణలు మాత్రం ఆయన ఖండించారు. తాను ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని అన్నారు. ఇతడిని ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. యూఏఈ, టర్కీ, మలేషియా దేశాలకు చెందిన కంపెనీల ద్వారా 2010 నుంచి ప్రభుత్వం పేరు చెప్పి అక్రమంగా కొన్ని మిలియన్స్ బ్యారెల్స్ ఆయిల్ అక్రమాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి.
ఎవరీ బాబక్ జంజానీ?
టెహ్రాన్ లో జన్మించాడు జంజానీ. టర్కీష్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. 1999లో ఇరాన్ సెంట్రల్ బ్యాంకు ను ముందుండి నడిపించాడు.
పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని భారీ ఆరోపణలున్నాయి
ఇరాన్ క్రిమినల్ కోడ్ ప్రకారం 'భూమిని ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడటం అతి పెద్ద నేరం' ఆ నేరం జంజానీ చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది.
మహ్మద్ అహ్మదీనెజాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విదేశాల్లో ఆయిల్ విక్రయాలు జరిపేందుకు అవకాశం తెచ్చిపెట్టడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు.
దుబాయ్లో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా 60 కంపెనీల ద్వారా కాస్మోటిక్స్, ఎయిర్ ట్రావెల్, బ్యాంకింగ్ వంటి సేవలు అందించాడు.