పాఠశాలపై దాడి చేసి అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసులకు పాకిస్థాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.
ఇస్లామాబాద్: పాఠశాలపై దాడి చేసి అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసులకు పాకిస్థాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. పెషావర్ సైనిక పాఠశాలపై దాడిలో ఆరుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష వేసింది. ఈ కేసులో ఏడుగురు దోషులుగా తేలారని పాకిస్థాన్ మిలటరీ తమ వెబ్ సైట్ లో వెల్లడించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు విధించినట్టు తెలిపింది.
నిష్పక్షపాతంగా విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసినట్టు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 14న పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు సాగించిన రాక్షకకాండలో 132 చిన్నారులతో సహా 145 మంది మృతి చెందారు. 114 మంది గాయపడ్డారు.