న్యూఢిల్లీ:యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.
ఈ ఏడాది మొదట్లోనే యెమెన్ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.
నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో యెమెన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.
ఇదీ చదండి: క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవితఖైదు
Comments
Please login to add a commentAdd a comment