
రక్తపు మడుగులో ఉన్న మృతదేహం గుండె ఓ పళ్ళెంలో ఉండగా.. మరికొన్ని అవయవాలు పొయ్యి మీద ఆయిల్ పెనంలో ఉన్నాయి...
ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోకల్ కోర్టు ఓ 35 ఏళ్ల వ్యక్తికి మరణ శిక్ష విధించింది. సునీల్ రామ కుచ్కోరవిను తల్లిని హత్య చేసి వేయించుకు తిన్న నేరానికి చనిపోయే వరకు ఉరి తీయాలని కొల్హాపూర్ అదనపు సెషన్స్ జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు ధృవీకరించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్ రామ కుచ్కోరవి 2017 ఆగస్టులో తన తల్లిని చంపాడు. హత్య జరిగినప్పుడు ఆ పరిసరాల్లోని ఓ పిల్లవాడు రక్తపు మరకలతో ఉన్న మృతదేహాన్ని చూశాడు. దీంతో అతడు భయపడి పెద్దగా ఏడవటంతో సమీపంలో ఉన్నవారు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
కాగా, అక్కడికి చేరుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూసాహెబ్ మాల్గుండేకు ద్రిగ్భాంతికర విషయాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం గుండె ఓ పళ్ళెంలో ఉండగా.. మరికొన్ని అవయవాలు పొయ్యి మీద ఆయిల్ పెనంలో ఉన్నాయి. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై న్యామమూర్తి స్పందిస్తూ.. ‘‘ఇది ఓ హత్య మాత్రమే కాదు.. కరుడుగట్టిన క్రూరత్వం.. మద్యానికి బానిసై తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. నిందితుడిలో కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేం. నిందితుడిని మరణించే వరకు ఉరి తీయాలి’’ అని జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ తీర్పునిచ్చారు.