అయిదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధించిన కొలంబో కోర్టు
చెన్నై: అయిదుగురు తమిళ జాలర్లకు కొలంబో కోర్టు ఉరిశిక్ష విధించింది. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ఆరోపణలపై 2011లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో అయిదుగురికి ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడానికి కొంత సమయం ఉంది.
ఈ అయిదుగురు జాలర్లు తమిళనాడులోని రామేశ్వరం పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందినవారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష విధించడం శ్రీలంక చరిత్రలో ఇదే మొదటిసారి. కొలంబో కోర్టు తీర్పుపై తమిళ పార్టీలు, తమిళ సంఘాలు స్పందించాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.
**