దాదాపు ఏడాది క్రితం పాట్నాలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బీహార్కు చెందిన ఓ పోలీసు అధికారికి మరణశిక్ష విధించారు. షమ్సే ఆలమ్ అనే అధికారికి మరణశిక్ష విధించగా, కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సింగ్, మరో ఆరుగురికి మరణించే వరకు జీవిత ఖైదు విధించారు. గత వారం విచారణ పూర్తి కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ సిన్హా తన తీర్పును అప్పట్లో వాయిదా వేశారు. ఆ తీర్పును మంగళవారం వెలువరించారు.
ఛార్జిషీటు ప్రకారం, వికాస్ రంజన్, ప్రశాంత్ సింగ్, హిమాంశు శేఖర్ అనే ముగ్గురు విద్యార్థులను 2002 డిసెంబర్ 28న ఆషియానా నగర్ ప్రాంతంలో మార్కెట్ సమీపంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారు. సమ్మేళన్ మార్కెట్లోని కొందరు దుకాణదారులపై హత్యాయత్నం చేసిన కేసులో ఆరుగురు దోషులుగా తేలారు. ఎస్టీడీ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన గొడవలో వారు ముగ్గురు విద్యార్థులను దారుణంగా కొట్టారు. దాంతో దుకాణదారులు పోలీసులను పిలిచి వారికి ఈ ముగ్గురు విద్యార్థులను అప్పగించారు. వాళ్లు దొంగలని, పలు నేరాల్లో ఉన్నారని చెప్పారు. అనంతరం పోలీసు రికార్డులలో ఆ విద్యార్థులను దోపిడీ దొంగలుగా చూపించి ఇద్దరు పోలీసులు వారిని కాల్చి చంపారు. దీనిపై విపక్షాలు గగ్గోలు పెట్టడంతో తొలుత స్థానిక పోలీసులకు అప్పగించిన ఈ కేసును తర్వాత సీఐడీకి, అనంతరం సీబీఐకి అప్పగించారు.
బూటకపు ఎన్కౌంటర్: పోలీసుకు మరణశిక్ష
Published Tue, Jun 24 2014 2:00 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
Advertisement