శాన్వి హంతకుడికి మరణ శిక్ష | Court upholds death sentence in killing of baby, grandmother | Sakshi
Sakshi News home page

శాన్వి హంతకుడికి మరణ శిక్ష

Apr 30 2017 1:25 AM | Updated on Jul 30 2018 8:37 PM

శాన్వి హంతకుడికి మరణ శిక్ష - Sakshi

శాన్వి హంతకుడికి మరణ శిక్ష

అమెరికాలో సంచలనం సృష్టించిన పెన్సిల్వేనియా జంట హత్యల కేసులో భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు అమెరికా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది.

2012లో అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ దారుణ హత్య
► గత తీర్పును సమర్థించిన పెన్సిల్వేనియా హైకోర్టు
న్యూయార్క్‌: అమెరికాలో సంచలనం సృష్టించిన పెన్సిల్వేనియా జంట హత్యల కేసులో భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు అమెరికా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012లో పెన్సిల్వేనియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది నెలల చిన్నారి శాన్వి వెన్నా, ఆమె నానమ్మ సత్యవతి వెన్నా(61) తమ అపార్ట్‌మెంట్‌లోనే హత్యకు గురయ్యారు. విలాసాలకు అలవాటుపడిన రఘునందన్‌ ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించిన జ్యూరి 2012 అక్టోబర్‌లో అతడిని దోషిగా తేల్చింది. 2015లో రఘునందన్‌కు కింది కోర్టు మరణశిక్షను విధించింది. దీనిని శుక్రవారం పెన్సిల్వేనియా హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

2012లో ఒక అపార్ట్‌మెంట్‌లో వృద్ధురాలు హత్యకు గురైందని, పది నెలల చిన్నారి అపహరణకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో ఒక నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నారి ప్రాణాలతో దక్కాలంటే 50 వేల డాలర్లు ఇవ్వాలని రాసి ఉంది. ఆ నోట్‌లో చిన్నారి తల్లిదండ్రుల ముద్దు పేర్లను రాయడం.. అవి వారి సన్నిహితులైన కొద్ది మందికే తెలియడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. చిన్నారి శాన్వి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే అయిన రఘునందన్‌ను అనుమానితునిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో తానే హత్యలు చేసినట్టు అంగీకరించాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని, తాను కావాలని హత్యలు చేయలేదని విచారణ సందర్భంగా రఘునందన్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement