Raghu Nandan
-
సత్యమేవ జయతే 1948
ఎం.వై.ఎం.క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే 1948’. ఈశ్వరబాబు. డి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచాన్ చేయగా శరద్ దద్భావాలా క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై. మహర్షి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన టైమ్‌లోని ముఖ్య నేతలు గాంధీ, నెహ్రూ, గాడ్సే, మహ్మద్ అలీ జిన్నా తదితర పాత్రలతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించి, గాడ్సే పాత్ర చేస్తున్న ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ– ‘‘11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి కథ తయారు చేయడం జరిగింది. 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రోపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్‌లో. 9 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. -
శాన్వి హంతకుడికి మరణ శిక్ష
2012లో అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ దారుణ హత్య ► గత తీర్పును సమర్థించిన పెన్సిల్వేనియా హైకోర్టు న్యూయార్క్: అమెరికాలో సంచలనం సృష్టించిన పెన్సిల్వేనియా జంట హత్యల కేసులో భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అమెరికా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012లో పెన్సిల్వేనియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది నెలల చిన్నారి శాన్వి వెన్నా, ఆమె నానమ్మ సత్యవతి వెన్నా(61) తమ అపార్ట్మెంట్లోనే హత్యకు గురయ్యారు. విలాసాలకు అలవాటుపడిన రఘునందన్ ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించిన జ్యూరి 2012 అక్టోబర్‌లో అతడిని దోషిగా తేల్చింది. 2015లో రఘునందన్‌కు కింది కోర్టు మరణశిక్షను విధించింది. దీనిని శుక్రవారం పెన్సిల్వేనియా హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. 2012లో ఒక అపార్ట్మెంట్లో వృద్ధురాలు హత్యకు గురైందని, పది నెలల చిన్నారి అపహరణకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో ఒక నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నారి ప్రాణాలతో దక్కాలంటే 50 వేల డాలర్లు ఇవ్వాలని రాసి ఉంది. ఆ నోట్లో చిన్నారి తల్లిదండ్రుల ముద్దు పేర్లను రాయడం.. అవి వారి సన్నిహితులైన కొద్ది మందికే తెలియడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. చిన్నారి శాన్వి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే అయిన రఘునందన్‌ను అనుమానితునిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో తానే హత్యలు చేసినట్టు అంగీకరించాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని, తాను కావాలని హత్యలు చేయలేదని విచారణ సందర్భంగా రఘునందన్ చెప్పాడు.