సంచలనం సృష్టించిన జర్మన్ బేకరీ పేలుడు కేసులో కీలక దోషి మీర్జా హిమాయత్ బేగ్‌కు కాస్త ఊరట లభించింది.
ముంబయి: సంచలనం సృష్టించిన జర్మన్ బేకరీ పేలుడు కేసులో కీలక దోషి మీర్జా హిమాయత్ బేగ్‌కు కాస్త ఊరట లభించింది. మీర్జాకు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు గురువారం జీవిత ఖైదుగా సవరించింది. 2010లో ముంబైలోని జర్మన్ బేకరీలో పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి మీర్జా హిమాయత్ బేగ్‌ను అరెస్టు చేయడం, 2013లో స్థానిక కోర్టు తీర్పు వెలువరించడం జరిగిపోయాయి. ట్రయల్ కోర్టు మీర్జాకు ఉరిశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. స్పందించిన హైకోర్ట్ మీర్జాకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చింది.