నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి.. కోర్టు తీర్పుపై సూటి ప్రశ్నలు సంధించారు.
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి.. కోర్టు తీర్పుపై సూటి ప్రశ్నలు సంధించారు. తన భర్తకు ఉరిశిక్ష విధించే ముందు కోర్టు వారు తమ అబ్బాయి సంగతి ఏమవుతుందో ఆలోచించి ఉండాల్సిందని ఆమె అన్నారు. రెండేళ్ల వయసున్న తన కుమారుడి పరిస్థితి ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు.
ఈ కేసు విషయంలో మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఉరిశిక్షను సవాలుచేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అక్షయ్ తండ్రి సరయు సింగ్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికీ సాకేత్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.