Akshay Thakur
-
దిగ్భ్రాంతికి గురయ్యాం
న్యూఢిల్లీ: ఇద్దరు దోషులకు విధించిన ఉరిశిక్షను సస్పెండ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంపై డిసెంబర్,16 సామూహిక అత్యాచార ఘటన బాధితురాలి తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైకోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం నాకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదు. నా కుమార్తెపై దోషులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తాను బతకాలని ఆశించింది. అయితే ఆమెను కాపాడుకోలేకపోయా. ఆమె మృతితో నేను సర్వం కోల్పోయా. ఏదైనా నిర్ణయం తీసుకునేందు ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నావంటి భావనలు, ఆలోచనలు కలిగిఉండాల్సింది’ అని అభిప్రాయపడ్డాడు. సుప్రీంకోర్టు తీర్పుతో నాతోపాటు మా కుటుంబసభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. దోషులకు ఉరిశిక్ష విధించాలనేదే నా చివరి డిమాండ్. అందుకోసం పోరాటం చేస్తూనే ఉంటా’ అని అన్నారు. కాగా ఈ కేసులో దోషులైన వినయ్‌శర్మ, అక్షయ్ఠాకూర్లకు హైకోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి విదితమే. పరిచితులే నిందితులు దేశ రాజధాని నగరంలో నమోదవుతున్న అత్యాచార కేసు బాధితుల్లో అత్యధిక శాతం మంది 18 ఏళ్ల లోపువారే. ఇందులోనూ గమనించాల్సిన అంశమేమిటంటే అత్యధిక శాతం మంది దోషులు బాధిత యువతులకు పరిచితులే. నగర పోలీసులు ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నగరంలో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు ఈ అధ్యయనం చేశారు. అత్యధికంగా 81.22 శాతం కేసుల్లో అత్యాచారానికి పాల్పడినవారికి, బాధిత యువతులకు మధ్య పరిచయం ఉండడంతోపాటు ఇటువంటివన్నీ సమీపంలోని గృహాల్లో జరిగినవే. 46 శాతం నేరాలు 18 ఏళ్లలోపు వారిపై జరిగినవే. ఈ విషయాన్ని సంబంధిత పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 21 శాతం మంది ఇరుగుపొరుగువారు అత్యాచారానికి పాల్పడగా, ఇంకో 41 శాతం మంది బాధితుల స్నేహితులతోపాటు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారేనని తేలింది. కాగా 2.25 శాతం కేసుల్లో నిందితులు బాధిత యువతుల తండ్రులేనని ఈ అధ్యయనంలో తేలింది. ఇంకా 1.25 శాతం మంది బాధితుల బాబాయిలు, 0.6 శాతం మంది సోదరులు, 1.34 శాతం మంది మాజీ భర్తలు, 1.8 శాతం మంది మామయ్యలు, 0.3 శాతం మంది సేవకులు, మరో 3.5 శాతం మంది ఆయా సంస్థల యజమానులు ఉన్నారు. 14 శాతం కేసుల్లో 16 నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన బాధిత యువతులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అత్యంత హేయంగా రెండు సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారిపైనా నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు 18 నుంచి 25 ఏళ్ల వయస్సుగల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల్లో 4.5 శాతం పూరిపాకల్లోనూ, 1.5 శాతం వాహనాల్లోనూ. మూడు శాతం ఉద్యానవనాల్లోనూ, దుకాణాలు, కార్యాలయాల్లో 1.2 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లలో 2.5 శాతం, పాఠశాలలు, కళాశాలల భవనాల్లో 0.75 శాతం జరిగాయి. 2013, డిసెంబర్ 13 తర్వాత నుంచి ఇప్పటిదాకా నగరవ్యాప్తంగా మొత్తం 1,647 కేసులు నమోదయ్యాయి. -
దిగువ కోర్టు తీర్పును సవాలు చేసిన ఇద్దరు దోషులు
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచార కేసులో దిగువకోర్టు ఇచ్చిన తీర్పును దోషులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లు హైకోర్టులో సవాలుచేశారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాది ఎ.పి.సింగ్ సోమవారం ఓ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ దిగువ న్యాయస్థానం గత నెలలో తీర్పు వెలువరించిన సంగతి విదితమే. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని నలుగురు దోషులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను దిగువకోర్టు న్యాయమూర్తి ఆలకించలేదని పిటిషనర్లు పేర్కొన్నార ని న్యాయవాది తెలిపారు. వినయ్ శర్మ వయస్సు 17 సంవత్సరాలేనని, అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ బాలనేరస్తుల చట్టం కింద విచారించాలని విన్నవించారన్నారు. వినయ్ పుట్టిన తేదీ పత్రాలను అతడి స్వగ్రామం తెప్పించి, సమర్పించాలంటూ దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. అంతేకాకుండా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని కోరినట్టు తెలిపారు. తన వయస్సు 17 సంవత్సరాల ఎనిమిది నెలలేనని, అందువల్ల మైనరేనని వినయ్ ఈ పిటిషన్లో పేర్కొన్నట్టు సింగ్ తెలిపారు. వయోనిర్ధారణ కోసం తనకు ఎముకల పరీక్ష చేయించాలని వినయ్ కోరాడని, అయితే సదరు విన్నపాన్ని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చిందన్నారు. కారాగారంలోనే ఉన్నప్పటికీ వినయ్ బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడన్నారు. వినయ్ జైలుకు రాకముందు జిమ్ ట్రెయిన్ అని, తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవాడని సింగ్ తెలిపారు. -
నిర్భయ కేసులో ఉరిశిక్ష సరే.. మా అబ్బాయి మాటేంటి?
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి.. కోర్టు తీర్పుపై సూటి ప్రశ్నలు సంధించారు. తన భర్తకు ఉరిశిక్ష విధించే ముందు కోర్టు వారు తమ అబ్బాయి సంగతి ఏమవుతుందో ఆలోచించి ఉండాల్సిందని ఆమె అన్నారు. రెండేళ్ల వయసున్న తన కుమారుడి పరిస్థితి ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఉరిశిక్షను సవాలుచేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అక్షయ్ తండ్రి సరయు సింగ్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికీ సాకేత్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
మా ఇద్దరిపై కేసులు రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించడం లేదని ఈ కేసులో ఇద్దరు నిందితులు శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు నిందితులు వినయ్ శర్మ, అక్షయ్‌ఠాకూర్ త రఫు న్యాయవాది ఏపీ సింగ్ అడిషినల్ సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా ఎదుట వాదించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని, తమ కక్షదారులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించారని ఆరోపించారు. వాదోపవాదాలు కొనసాగుతుండగానే సింగ్ స్పృహతప్పి పడిపోవడంతో విచారణ నిలిచిపోయింది. ఒత్తిళ్ల కారణంగా సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ (బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన న్యాయమూర్తి), మె ట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ప్రాథమిక విచారణ నిర్వహించిన న్యాయమూర్తి) వైఖరి కూడా మారిందని ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చే యాల్సి ఉండగా, రాజకీయ నాయకులు వారిపై ఒత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన తరువాత ఎలాంటి ఆదేశాలూ లేకున్నా కేసు త్వరిత విచారణకు అప్పటి న్యాయమూర్తి అమిత ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. వినయ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న రక్తపు మరకలు, నిర్భయ స్నేహితుడి బూట్ల వంటివన్నీ పోలీసులే సృష్టించారన్నారు. తగిన విశ్లేషణ లేకుండా ఫోరెన్సి క్ నివేదికలను ప్రాసిక్యూషన్ అవసరాల మేరకు త యారు చేశారని సింగ్ పేర్కొన్నారు. రాజకీయ ఒత్తి ళ్లే వీటన్నింటికి కారణమని స్పష్టం చేశారు. అయితే సింగ్ స్పృహ కోల్పోవడంతో విచారణను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించా రు. పవన్ తరఫున వాదనలను వినిపించడానికి వ చ్చే నెల రెండు దాకా సమయం కావాలన్న అతని న్యాయవాది వివేక్‌శర్మ అభ్యర్థనను కోర్టు తిరస్కరిం చింది. ఇదిలా ఉంటే మంగళవారం విచారణ సందర్భంగా డిఫెన్స్ న్యాయవాదులు మాట్లాడుతూ సామాహిక అత్యాచారానికి ‘నిర్భ య’ స్నేహితుణ్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా హిం సించారని, తమ కక్షిదారులను అన్యాయంగా కే సు ఇరికించారని ఆరోపించారు. బాధితురాలు నిర్భయ, ఆమె స్నేహితుడు ఈ కేసు వివరాలను పోలీసులకు చెప్పనేలేదని వా దించారు. అధికారు లే అతణ్ని వేధించి అసత్యాలు చెప్పించారని ఆరోపించారు. ‘అత్యాచారం జరిగిన ట్టు చెబుతున్న బస్సు, దాని రంగు వివరాలను కూ డా ఆమె వెల్లడించలేదు. నిందితుల సంఖ్య, వారు వేసుకున్న దుస్తుల గురించి కూడా తెలియజేయలేదు. నిందితుల గుర్తింపునకు సంబంధించిన ఏ ఒ క్క విషయాన్నీ ఆమె స్నేహితుడు ఎఫ్ఐఆర్లో పే ర్కొనలేదు’ అని నిందితుల న్యాయవాది ఏపీసింగ్ వాదించారు. నిర్భయ తన వాంగ్మూలంలో నిందితు లు తనపై చెంపపై కొట్టినట్టు మాత్రమే చెప్పిం దని, రాడ్డుతో దాడి చేసిన విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. ఆమెపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు వైద్యనివేదికలు వెల్లడించాయన్నారు.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గత డిసెంబర్ 16 రాత్రి నిందితు లు రామ్‌సింగ్, వినయ్, అక్షయ్, పవన్‌గుప్తా, ముకేశ్, మైనర్ (ఇతనిపై బాలల న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది) ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికి త్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ దాడిలో నిర్భయ స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి.