చైనాలోని ఓ మార్కెట్లో ఉగ్రదాడులకు పాల్పడిన ముగ్గురికి మరణశిక్ష విధించారు. మరో ఐదుగురికి యావజ్జీవ జైలు శిక్ష వేశారు. హుసాన్జన్ వక్సర్, యుసుప్ ఉమర్నియాజ్, యుసుప్ అహ్మత్ అనే ముగ్గురు ఓ ఉగ్రవాద బృందానికి నేతృత్వం వహిస్తూ, ప్రమాదకర పద్ధతుల ద్వారా ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లేలా చేశారంటూ కోర్టు వారికి మరణ శిక్ష విధించింది.
బీజింగ్లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద 2013 అక్టోబర్ నెలలో వీరు దాడులకు పాల్పడ్డారు. మరో ఐదుగురికి యావజ్జీవ ఖైదు విధించారు. వీళ్లంతా కలిసి గత సంవత్సరం అక్టోబర్ నెలలో బాగా రద్దీగా ఉన్న మార్కెట్లో ఓ జీపును వేగంగా నడిపించి, ఇద్దరి మరణానికి, 40 మంది గాయపడటానికి కారణమైనట్లు సిన్హువా వార్తాసంస్థ తెలిపింది.
ముగ్గురు ఉగ్రవాదులకు మరణ శిక్ష
Published Mon, Jun 16 2014 2:18 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
Advertisement
Advertisement