పాకిస్థాన్‌లోని వివాదాస్పద దైవదూషణ వ్యతిరేక చట్టం ఆధారంగా ఒక వ్యక్తికి లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది.
లాహోర్: పాకిస్థాన్‌లోని వివాదాస్పద దైవదూషణ వ్యతిరేక చట్టం ఆధారంగా ఒక వ్యక్తికి లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. 2008లో లాహోర్‌లోని ఇస్లాంపు ప్రాంతంలో ఉన్న ఒక గోడపై దైవాన్ని నిందిస్తూ రాతలు రాశాడన్న ఆరోపణలపై జుల్ఫీకర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జుల్ఫీకర్ అలీ ఖండించారు.