సాక్షి ప్రతినిధి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్తుడికి మరోశిక్ష పడింది. వివాహితతో సహజీవనం చేసి, ఆమె మైనర్ కూతురిని భయపెట్టి పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తేలడంతో యావజ్జీవ (చనిపోయే వరకు) కారాగార శిక్ష విధిస్తూ వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు (మైనర్లపై లైంగిక కేసుల విచారణ ప్రత్యేక కోర్టు) జడ్జి జయకుమార్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. కాగా, 9 మందిని హత్య చేసిన కేసులో ఇదే కోర్టు సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ అక్టోబర్ 28న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
వలస కూలీగా వచ్చి..
బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ వరంగల్ శివారు లోని గోనె సంచుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రఫీకా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉండటం గమనించి ఆమెకు దగ్గరయ్యాడు. తన మైనర్ కుమార్తెను లొంగదీసుకునేందుకు సంజయ్ ప్రయత్నించగా రఫీకా అతడితో గొడవ పడింది. అయినా ఆమె లేని సమయంలో కూతురిపై లైంగికదాడి చేసేవాడు. ఈ క్రమంలో మార్చి 6న రఫీకాను తీసుకొని సంజయ్ పశ్చిమ బెంగాల్ బయలుదేరాడు. ఏపీలోని తాడేపల్లిగూడెం వద్ద కదులుతున్న రైలు నుంచి రఫీకాను తోసేసి హత్య చేశాడు. మరుసటిరోజు ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆమె బంధువులు అతడిని నిలదీయడంతో వారిని అడ్డు తొలగించు కోవా లని అన్నంలో నిద్రమా త్రలు కలిపి ఆమె బంధువులు 9 మం దిని హత్య చేసి బావిలో పడే శాడు. బాలికకు పరీక్షలు నిర్వ హించగా గర్భవతి అని తేలింది. లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో సంజ య్‌కు యావజ్జీవ శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇతర శిక్షలు కూడా ఏకకాలంలో అమలుపర్చాలని పేర్కొంది.
బాలికకు రూ.4 లక్షల పరిహారం
బాధిత బాలికకు ప్రభుత్వ పునరావాస పరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించాలని జడ్జి జయకుమార్ తీర్పులో వెల్లడించారు. దేశ న్యాయస్థాన చరిత్రలో పోక్సో చట్టం కింద ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
మొన్న ఉరిశిక్ష.. నేడు యావజ్జీవం
Published Sat, Dec 12 2020 4:48 AM | Last Updated on Sat, Dec 12 2020 9:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment