సాక్షి ప్రతినిధి, చెన్నై: కూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడిందనే కోపంతో అల్లుడిని చంపిన కేసులో మామసహా ఆరుగురు బంధువులకు తమిళనాడు కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంటూ తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ మంగళవారం తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లా ఉడుమలై దగ్గర్లోని కుమరలింగంకు చెందిన వేలుస్వామి కొడుకు శంకర్(22) ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
దిండుగల్లు జిల్లా పళనికి చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య (20)ను శంకర్ ప్రేమించాడు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో కౌసల్య తల్లిదండ్రులు వీరి ప్రేమను వ్యతిరేకించారు. పెద్దలను కాదని శంకర్, కౌసల్య పెళ్లిచేసుకున్నారు. గతేడాది మార్చి 13న వీరిద్దరూ ఉడుమలై బస్‌స్టేషన్‌కు నడిచి వెళ్తుండగా కొందరు మారణాయుధాలతో దాడిచేశారు.శంకర్ మరణించగా, తీవ్ర గాయాలపాలైన కౌసల్య ఆసుపత్రిలో కోలుకుంది. కౌసల్య తల్లి అన్నలక్ష్మి, మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment