న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి దాదాపు 5.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ ఓ వ్యక్తి మరికొంత కాలం జీవించడానికి తోడ్పడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓక్లహోమాలోని యూకాన్‌కు చెందిన డానియల్ లీ.. 1996లో గన్స్ డీలర్ విలియం ముల్లెర్, అతని భార్య నాన్సి, 8 ఏళ్ల కుమార్తె సారా పొవెల్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు. దీంతో న్యాయస్ఙానం అతనికి మరణశిక్ష ఖరారు చేసింది. (వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న భారత సంతతి వ్యక్తి)
ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం రోజున లీకి ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి లీ కుటుంబ సభ్యులు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా భయానక పరిస్థితుల్లో తాము.. అంతా దూరం ప్రయాణించలేమని లీ కుటుంబ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో జిల్లా చీఫ్ జస్టిస్ ఆ మరణ శిక్షను వాయిదా వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇలా కరోనా వైరస్.. లీ మరికొంత కాలం జీవించడానికి సాయం చేసినట్టయింది. కాగా, ఫెడరల్ కోర్టు నిర్ణయించిన మరణశిక్షను వాయిదా వేయడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి.(చెప్పుల దుకాణంలో మహిళ అనుచిత ప్రవర్తన)
Comments
Please login to add a commentAdd a comment