ప్రమాద పరిస్థితిని ప్రధాని మోదీకి వివరిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు
కొరాపుట్: అత్యంత విషాదకర ఘటనలో దేశంలో ప్రముఖులు ప్రోటోకాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా పరామర్శలతో ముందుకు కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలీపాడ్ తయారు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి పొలంలోనే ప్రధాని దిగారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోయినా చిన్న టెంట్‌లోనే సమీక్ష చేశారు.
ఘటనపై రైల్వేమంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌తో మాత్రమే ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి నవీన్ లేకపోవడం విశేషం. అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయ చర్యల సమయంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment