మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
రైల్వేస్టేషన్లు..
విజయవాడలో 0866 2576924,
రాజమండ్రిలో 0883 2420541,
రేణిగుంటలో 9949198414,
తిరుపతిలో 7815915571,
నెల్లూరులో 0861 2342028,
సామర్లకోటలో 7780741268,
ఒంగోలులో 7815909489,
గూడూరులో 08624250795,
ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది.
అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది.
రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
రద్దయిన రైళ్లు ఇవే... ఈ రూట్‌లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్(ఈస్ట్ కోస్ట్), హౌరా-సికింద్రాబాద్(ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్), హౌరా-తిరుపతి రైళ్‌లు రద్దు అయ్యాయి. అలాగే..
12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్‌ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023)
Comments
Please login to add a commentAdd a comment