helpline numbers
-
కోరమాండల్ ప్రమాదం.. హెల్ప్‌లైన్ నెంబర్లు, రద్దైన రైళ్ల వివరాలు ఇవే
మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రద్దయిన రైళ్లు ఇవే... ఈ రూట్లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్(ఈస్ట్ కోస్ట్), హౌరా-సికింద్రాబాద్(ఫలక్నామా ఎక్స్‌ప్రెస్), హౌరా-తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. అలాగే.. 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023) -
‘నివర్’ పడగ; కంట్రోల్ రూమ్ నంబర్లు
సాక్షి, కడప: నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..) కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే.. నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలి. పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి బంధువుల ఇంటికి కానీ, లేదా ప్రభుత్వం చూపించే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి. నివర్ తుఫాన్ కారణంగా రేపు (గురువారం) జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ శైలజ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్ : 08562 - 245259 సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప : 08562 - 295990, 93814 96364, 99899 72600 సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట : 08565 - 240066, 93816 81866 ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 96766 08282, 08560- 271088 దక్షిణమధ్య రైల్వే హెల్ప్లైన్లు నివర్ తుపాను నేపథ్యంలో రైల్ సర్వీసుల్లో మార్పులుండే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తుపాను ప్రభావం చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సమాచారం మేరకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ప్రయాణికులు సహాయం కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు. సికింద్రాబాద్: 040-27833099 విజయవాడ: 0866-2767239 గుంటూరు: 0863-2266138 గుంతకల్లు: 7815915608 -
ఈపీఎఫ్ఓ : వాట్సాప్ హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. పీఎఫ్ చందారుల సౌలభ్యం కోసం కొత్తగా వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఫిర్యాదులు, సందేహాల నివృత్తి చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 24x7 టోల్ ఫ్రీ నంబర్, పోర్టల్ , ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చింది. దేశంలోని 138 ప్రాంతీయ కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సంబంధిత ప్రాంతీయ కార్యాలయ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా పీఎఫ్ అందించే సేవలకు సంబంధించిన సందేహాలు తీర్చుకోవడంతొపాటు, ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సత్వర, సురక్షితమైన సేవలు లభిస్తాయని ప్రకటించింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా 1,64,040 కు పైగా ఫిర్యాదులను, ప్రశ్నలను పరిష్కరించామని తెలిపింది. ఈ కొత్త సౌలభ్యం ద్వారా ఖాతాదారులు కార్యాలయాలను భౌతికంగా సందర్శించాల్సిన అవసరాన్ని బాగా తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే వాట్సాప్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక నిపుణుల బృందం అందుబాటులో ఉంటుందని కార్మికశాఖ తెలిపింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఆపదలో హెల్ప్‌లైన్ భరోసా
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు కొండంత భరోసా ఇస్తున్నాయి. కరోనా బాధితులకు, అనుమానితులకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నాయి. ఇక్కడి సిబ్బంది ఆస్పత్రుల సమాచారమే కాకుండా ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. పాజిటివ్ బాధితులకు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే డాక్టరుకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని, మిగతా చిన్న చిన్న సమస్యలకు డాక్టర్లు సూచించిన మేరకు ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లను సామాన్యులు సైతం ఇప్పుడు బాగా వినియోగించుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమస్యలుంటే క్షణాల్లో స్పందన ► కోవిడ్‌కు సంబంధించిన ఎటువంటి సమస్యకైనా హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ► 104కి కాల్ చేసి 2 నొక్కితే సమస్త సమాచారం చెబుతారు. ► లేదంటే జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకైనా ఫోన్ చేయవచ్చు. ► పడకలు, ఆస్పత్రులు, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఇలాంటి సమాచారం మొత్తం లభిస్తుంది. ► బాధితుడి ఇంటికి సమీపంలో ఉన్న మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, నర్సుల సమాచారమూ ఇస్తారు. రాష్ట్రస్థాయిలో వివిధ సమస్యలకు నంబర్లు స్టేట్ కంట్రోల్ రూమ్ 08662410978 దీంతో పాటు 104 కూడా.. కోవిడ్ కాకుండా అత్యవసర సేవలకు 108 ఆరోగ్య సమస్యలకు 14410 వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే 8297104104 జిల్లాల వారీగా కోవిడ్ కాల్‌సెంటర్ నంబర్లు జిల్లా నంబరు శ్రీకాకుళం 6300073203 విజయనగరం 08922–227950, 9494914971 విశాఖపట్నం 9666556597 తూర్పుగోదావరి 08842356196 పశ్చిమగోదావరి 18002331077 కృష్ణా 9491058200 గుంటూరు 08632271492 ప్రకాశం 7729803162 నెల్లూరు 9618232115 చిత్తూరు 9849902379 వైఎస్సార్ 08562–245259 అనంతపురం 08554–277434 కర్నూలు 9441300005 -
ఆత్మహత్యలపై టాలీవుడ్ ఉద్యమం
మనిషిలో మానసిక ఒత్తిడి, ఇతరులకు దూరంగా ఉండటం ప్రధానంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడేవారికి సరైన సమయంలో సాయం అందించడం ద్వారా ఆత్మహత్యలను కొంతమేర నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారిని ఆ ఆలోచనల నుంచి బయటకి తీసుకురావడానికి సాయం అందించే హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని వారు అంటున్నారు. అయితే దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం కూడా ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ హెల్ప్‌లైన్ నంబర్లపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ముందుకువచ్చారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేయడమే కాకుండా.. మరో ఇద్దరు దీనిని రీ-పోస్ట్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, నిహారిక కొణిదెల, రాహుల్ రవీంద్రన్, దేవకట్టా.. ఇలా పలువురు ప్రముఖులు ట్విటర్లో ఈ సందేశాన్ని షేర్ చేశారు. Requesting @Samanthaprabhu2 & @ShraddhaSrinath to copy & post, tagging a couple of friends in order to demonstrate that someone is always listening.#Suicide Awareness: For US: 1-800-273-8255 #Suicide Awareness: For India: 09152987821 https://t.co/GLgEVROKX5 — Rana Daggubati (@RanaDaggubati) June 25, 2020 Requesting @IamNiharikaK & @actor_Nikhil to copy & post, tagging a couple of friends in order to demonstrate that someone is always listening.#Suicide Awareness: For US: 1-800-273-8255 #Suicide Awareness: For India: 09152987821 https://t.co/MldOd3ZZgj — Ritu Varma (@riturv) June 25, 2020 -
అనారోగ్యమా.. అయితే ఫోన్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచి పోవడంతో ‘ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ’ ఆన్లైన్లో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్‌లైన్ నెంబర్ : 040–48214595కు ఫోన్ చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్ చేస్తారు. తమకున్న సమస్యను డాక్టర్లకు వివరిస్తే ఫోన్లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటీ రాసిచ్చి వాట్సాప్‌లో పెడతారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దాదాపు 140 మంది వివిధ స్పెషలిస్ట్ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని సంస్థ తరపున ఆన్లైన్లో సేవలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సేవలన్నీ ఉచితం గానే ప్రజలకు చేస్తున్నట్లు ఆయన వివరిం చారు. లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది. కొందరు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఓపీ బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రోజులో 275 ఫోన్ కాల్స్... బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్‌కు ఒక్కరోజులోనే 275 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన బాధితులు, రోగులతో దాదాపు 957 నిమిషాలు డాక్టర్లు మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. మందులు సూచించారు. కొందరికి వాట్సాప్ ద్వారా మందుల చీటీని పంపించారు. సగటున ఒక్కో కాల్‌కు 4 నిమిషాలు వైద్యులు కేటాయించినట్లు రవీంద్రనాథ్ తెలిపారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అధికంగా కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. కొందరు వైద్యులు, సాంకేతిక వృత్తినిపుణులు తదితరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశామని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ప్రసాద్ తెలిపారు. -
గల్ఫ్ ప్రవాసీలకు ‘కరోనా’ హెల్ప్లైన్ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధి కోసం దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన లక్షలాదిమంది భారతీయులు లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అలాంటి వారి బంధువులకు ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఫిర్యాదు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలో హెల్ఫ్‌లైన్ నంబర్లును ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులో ఉంచింది. కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నం: 1800 11 8797, టెలీఫోన్ నంబర్లు: 91 11 2301 2113/ 4104/ 7905. ఈమెయిల్: ఛిౌఠిజీఛీ19ః ఝ్ఛ్చ.జౌఠి.జీn ప్రత్యేక సహాయం కావాల్సిన వారు విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ వ్యవహారాలు) డా.టి.వీ నాగేంద్రప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం నిరంతరం అందుబాటులో పనిచేస్తోంది. వీరిని సంప్రదించాలనుక్నునవారు. +91 11 4901 8480, +91 92050 66104కు కాల్ చేయవచ్చు. మొత్తం 85 లక్షల మంది భారతీయులు.. గల్ఫ్ దేశాల్లో భారతదేశానికి చెందిన దాదాపు 85 లక్షలమందికిపైగా వివిధ ఉద్యోగా లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే సుమారుగా 13 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. వీరికోసం సౌదీ అరేబియాకు చెందిన భారత రాయబార కార్యాలయంలో +9714 3971 222 / 333 సంప్రదించవచ్చు. అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం నంబరు: +971 2 4492700 ఫోన్ చేయవచ్చు, అలాగే యూఏఈ ప్రభుత్వ హెల్ప్లెన్ నెంబర్లు 9712 4965228, +97192083344ను ఆశ్రయించవచ్చు. వదంతులు నమ్మవద్దు.. కరోనా సందర్భంగా గల్ఫ్‌లో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతామని కొందరు విమాన టికెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్ వెల్లడించారు. అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ జరిగి, అధికారికంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే వరకు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. -
కరోనా హెల్ప్‌లైన్ నెంబర్లు
కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. అత్యవసర సేవల కొరకు కొన్ని ఆయా రాష్ట్రాలు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేశాయి. రాష్ట్రాల వారిగా హెల్ప్ లైన్ల వివరాలు ప్రాంతం హెల్ప్ లైన్ నెంబర్లు సెంట్రల్ హెల్ప్‌లైన్ +91-11-23978046 ఆంధ్రప్రదేశ్ 0866-2410978 అరుణాచల్ ప్రదేశ్ 9436055743 అస్సాం 6913347770 బీహార్ 104 ఛత్తీస్గడ్ 104 గోవా 104 గుజరాత్ 104 హర్యానా 8558893911 హిమాచల్‌ప్రదేశ్ 104 జార్ఖండ్ 104 కర్ణాటక 104 కేరళ 0471-2552056 మధ్యప్రదేశ్ 104 మహారాష్ర్ట 020-26127394 మణిపూర్ 3852411668 మేఘాలయ 108 మిజోరం 102 నాగలాండ్ 7005539653 ఒడిశా 9439994859 పంజాబ్ 104 రాజస్తాన్ 0141-2225624 సిక్కిం 104 తమిళనాడు 044-29510500 తెలంగాణ 104 త్రిపుర 0381-2315879 ఉత్తరాఖండ్ 104 ఉత్తరప్రదేశ్ 18001805145 పశ్చిమ బెంగాల్ 1800313444222, 03323412600 కేంద్రపాలిత ప్రాంతాలు హెల్ప్ లైన్ నెంబర్లు అండమాన్ నికోబర్ దీవులు 03192-232102 చంఢీఘర్ 9779558282 డామన్, డయ్యూ 104 ఢిల్లీ 011-22307145 జమ్ము అండ్ కశ్మీర్ 01912520982, 019 4-2440283 లడాఖ్ 01982256462 ల క్షదీప్ 104 పాండిచ్చె రి 104 -
రైతు భరోసాపై అపోహలు వీడండి
సాక్షి, ఆత్మకూరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా అమలులో రైతులు అనేక అపోహలతో ఉన్నారని వ్యవసాయ అధికారుల ద్వారా వివరాలు తెలు సుకుని అవగాహన పెంచుకోవాలని ఆత్మకూరు మండల వ్యవసాయాధికారి ఎస్.ప్రసాద్‌రావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసా పొందాలనుకునే రైతుకు కనీసం ఒక ఎకరం పొలం కలిగి ఉండాలన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు అర ఎకరా, ఆకు తోటలు సాగు చేసే రైతులు పది సెంట్లు పొలం కలిగి ఉన్నా ఈ పథకానికి అర్హత పొందుతారన్నారు. అయితే రేషన్‌కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి ఒక రైతు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అలాగే భూమిలేని కౌలు రైతులకు సంబంధించిన అర్హతలపై కూడా రైతుల్లో కొంత అవగాహన లోపం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలకు చెందిన వ్యక్తులు తమ పేరు మీద ఒక్క సెంటు కూడా భూమి లేకుండడంతో పాటు కౌలుకిచ్చే రైతులు కూడా అర్హులై ఉండాలనే విషయం గమనించాలన్నారు. ఒకటిన్నర ఎకరం మాగాణి, రెండున్నర ఎకరం మెట్ట భూమికి తగ్గకుండా యాజమాన్య హక్కులున్న రైతులు మాత్రమే తమ పొలం కౌలుకిచ్చే అర్హత ఉందన్నారు. అలాగే 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వెబ్‌ల్యాండ్‌లో అనుసంధానం చేసిన రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందన్నారు. ఎంపీఈఓల సేవలు వినియోగించుకోండి ప్రతి గ్రామంలోనూ రైతులకు ప్రభుత్వపరమైన పథకాలు వివరించి పంటల సాగులో సహకరించేందుకు వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారుల(ఎంపీఈఓలు)ను నియమించిందని ఏఓ ప్రసాద్‌రావు తెలిపారు. ఎంపీఈఓల వద్ద రైతు భరోసాకు అర్హులైన రైతుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. పొరపాటున ఎవరైనా నమోదు కాకుంటే వారి వద్ద తగు వివరాలతో నమోదు చేయించుకోవాలన్నారు. ఆత్మకూరు మండలంలోని వ్యవసాయ అధికారుల వివరాలు -
సచివాలయ అభ్యర్థులకు మరో హెల్ప్‌డెస్క్
సాక్షి, కడప : గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలు రాసే అభ్యర్థులకు సహాయకారిగా సోమవారం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ, హెల్ప్‌డెస్క్ నెంబర్లకు అదనంగా మరో ఫోన్ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామక పరీక్ష రాసే అభ్యరులు హాల్ టిక్కెట్, పరీక్షా కేంద్రాలు, ఇతరత్రా సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబరు 1077 ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ లేదా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ నుంచి మాత్రమే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది కాకుండా ల్యాండ్ ఫోన్ నెంబర్లు 08562–255572, 08562–246344లను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 27వ తేదినుంచి సెప్టెంబరు 8వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌డెస్క్ నెంబర్లు పనిచేస్తాయన్నారు. -
ఫిర్యాదుల కంటే.. శుభాకాంక్షలే ఎక్కువ
న్యూఢిల్లీ : ఎవరికైనా హెల్ప్‌లైన్ నెంబర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే తమ సమస్యను ఫిర్యాదు చేసుకునేందుకు. కానీ రైల్వేలో అలా కాదంట. రైల్వే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫిర్యాదుల కంటే శుభాకాంక్షల మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయట. వాట్సాప్ వాడకం విస్తృతంగా ఉండటంతో, రైల్వే ఇటీవలే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్లను అపరిశుభ్రతంగా ఉన్న స్టేషన్ పరిసరాలు, టాయిలెట్ల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్(వెస్ట్రన్ రైల్వే) కోసం 90044 99773 నెంబర్‌ను, సీఆర్(సెంట్రల్ రైల్వే)లోని ప్రయాణికులు 9987645307 నెంబర్‌కు ప్రయాణికులు తమ ఫిర్యాదులను వాట్సాప్ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ రెండు నెంబర్లకు ప్రస్తుతం ఫిర్యాదుల కంటే ఎక్కువగా శుభాకాంక్షల మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్ ఈవ్నింగ్ వంటి టెక్ట్స్ మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాక దేవతలతో కూడిన భక్తి సందేశాలు, వినోదభరిత హిందీ పద్యాల మెసేజ్‌లను తాము పొందుతున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాల గురించి వారంలో కేవలం 25 ఫిర్యాదులే వచ్చాయని అధికారులు చెప్పారు. మిగతావన్నీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, ఫార్వర్డ్ మెసేజ్‌లే ఉన్నాయన్నారు. సాధారణంగా అపరిశుభ్రతంగా ఉన్న రైల్వే పరిసరాల గురించి ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు తాజాగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రవేశపెట్టారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాలను, టాయిలెట్లను క్లిక్ చేసి, వాట్సాప్ నెంబర్‌కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదుల కోసం కంప్లయింట్స్ సెల్ ఒకటి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సిబ్బందిని దీని కోసమే నియమించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే వారు చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆఫీసులు ఎప్పడికప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి రవిందర్ భాకేర్ చెప్పారు. ఇప్పటి వరకు వెస్ట్రన్ రైల్వే వాట్సాప్ నెంబర్‌కు 23 ఫిర్యాదులు, సెంట్రల్ రైల్వే వాట్సాప్ నెంబర్ రెండు ఫిర్యాదులను పొందిందని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను కంట్రోల్ డిపార్ట్మెంట్కు పంపామని, వాటిని సంబంధిత స్టాఫ్‌కు(స్టేషన్ మాస్టర్) పంపిస్తామని తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రస్తుతమైతే ఎలాంటి డెడ్‌లైన్ లేదని, కానీ అదే రోజు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. -
ఇళ్లలోంచి బయటకు రావొద్దు: సీఎం
-
ఇళ్లలోంచి బయటకు రావొద్దు: సీఎం
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో వణుకుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు కష్టాలు పడుతున్నారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లపాలయ్యారు. దాదర్, చెంబూర్, సైన్, వర్లీ, లోయర్ పరేల్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు లోకల్ రైళ్లు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుతురు మందగించడంతో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సలహాలు పాటించాలని, ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుంటే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. ట్విటర్ ద్వారా సమాచారం అందించినా అధికారులు స్పందిస్తారని తెలిపారు. సహాయం కావాల్సిన వారు 100 నంబర్ ద్వారా తమను సంప్రదించాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా తలత్తిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. ఇతర సహాయక నంబర్లు ముంబై పోలీస్ వైర్లెస్: 22633319 బీఎంసీ హెల్ప్‌లైన్: 1916 బీఎసీ ల్యాండ్‌లైన్: 22694719 సివిల్ డిఫెన్స్: 22856435 ట్రాఫిక్ హెల్ప్‌లైన్: +91-8454999999 ఎంసీజీఎం హెల్ప్‌లైన్: +91-22-22694725 -
బాధ్యత లేదా!
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరో మారు మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. మద్యం బానిసల పునరావసం కోసం ప్రకటించిన హెల్ప్‌లైన్ నంబర్లకు స్వయంగా డైల్ చేసిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కౌల్ విస్మయానికి గురయ్యారు. ఆ నం బర్లు ప్రస్తుతం అందుబాటులో లేదని వచ్చిన సమాచారంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల అపహరణల అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. చెన్నైకు చెందిన న్యాయవాది ఇటీవల మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో మద్యం బానిసల సంఖ్య పెరుగుతున్నదని, ఆదాయాన్ని చూస్తున్నారేగానీ, ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదని అందులో వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమ నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యం బానిసలకు పునరావస కల్పన చర్యలు తీసుకోవడం లేదని, మద్యం కారణంగా ఎదురయ్యే నష్టాలు, కష్టాల గురించి అవగాహన కల్పించడం లేదని అందులో వివరించారు. ఇందుకు తగ్గ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించి ఉన్నదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌల్, కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ బాలు హాజరై ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదులు మద్యం, మత్తు బానిసలకు పునరావాసం కల్పించడం తదితర వాటి కోసం రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. ఇందులో ఒకటి సహాయం కోసం, మరొకటి వైద్య సేవల కోసం అని పేర్కొన్నారు. అలాగే, 10581 ఓ నంబరు, 104 మరో నంబరు అని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఆ నంబర్లు పని చేయడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు సూచించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్కోల్ స్వయంగా తన మొబైల్ తీసుకుని ఆ నంబర్లకు డైల్ చే సి విస్మయంలో పడ్డారు. స్పీకర్ ఆన్ చేసి మరీ అటు వైపుగా వచ్చిన ‘ఈ నంబర్ అందుబాటులో లేదు’ అన్న సమాధానాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు విన్పించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, బాధ్యత లేదా, ఇదేనా పని తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోరా..? అని అక్షింతలు వేశారు. ప్రభుత్వ తీరును చూస్తే ఆవేదన కల్గుతున్నదని వాఖ్యానించారు. రెండు వారాల్లోపు కమిటీ ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తదుపరి నగరంలో పిల్లల అపహరణ కేసును పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి పిల్లలు అపహరణకు గురి అవుతుంటే, ఇంత నిర్లక్ష్యమా అని నగర పోలీసు యంత్రాంగానికి తీవ్రంగానే అక్షింతలు వేశారు. -
రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లు..
విజయవాడ: తునిలో కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే 15 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ రైల్వే కంట్రోల్ రూంలో డీఆర్ఎం అశోక్ కుమార్ పరిస్థతిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే అధికారులు పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ(0866-2575038), తుని(08854-252172)లలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా విశాఖపట్నం రైల్వే అధికారులు (0891-2744619, 2575183, 83003) హెల్ప్‌లైన్ నెంబర్లను తెలిపారు. ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులకు టికెట్ రుసుం తిరిగి చెల్లించనున్నట్లు డీఆర్ఎం అశోక్ కుమార్ తెలిపారు.