
సాక్షి, కడప : గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలు రాసే అభ్యర్థులకు సహాయకారిగా సోమవారం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ, హెల్ప్‌డెస్క్ నెంబర్లకు అదనంగా మరో ఫోన్ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామక పరీక్ష రాసే అభ్యరులు హాల్ టిక్కెట్, పరీక్షా కేంద్రాలు, ఇతరత్రా సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబరు 1077 ఏర్పాటు చేశామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ నుంచి మాత్రమే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది కాకుండా ల్యాండ్ ఫోన్ నెంబర్లు 08562–255572, 08562–246344లను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 27వ తేదినుంచి సెప్టెంబరు 8వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌డెస్క్ నెంబర్లు పనిచేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment