
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు కొండంత భరోసా ఇస్తున్నాయి. కరోనా బాధితులకు, అనుమానితులకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నాయి. ఇక్కడి సిబ్బంది ఆస్పత్రుల సమాచారమే కాకుండా ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. పాజిటివ్ బాధితులకు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే డాక్టరుకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని, మిగతా చిన్న చిన్న సమస్యలకు డాక్టర్లు సూచించిన మేరకు ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లను సామాన్యులు సైతం ఇప్పుడు బాగా వినియోగించుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కోవిడ్ సమస్యలుంటే క్షణాల్లో స్పందన
► కోవిడ్‌కు సంబంధించిన ఎటువంటి సమస్యకైనా హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
► 104కి కాల్ చేసి 2 నొక్కితే సమస్త సమాచారం చెబుతారు.
► లేదంటే జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకైనా ఫోన్ చేయవచ్చు.
► పడకలు, ఆస్పత్రులు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఇలాంటి సమాచారం మొత్తం లభిస్తుంది.
► బాధితుడి ఇంటికి సమీపంలో ఉన్న మెడికల్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, నర్సుల సమాచారమూ ఇస్తారు.
రాష్ట్రస్థాయిలో వివిధ సమస్యలకు నంబర్లు
స్టేట్ కంట్రోల్ రూమ్ 08662410978 దీంతో పాటు 104 కూడా..
కోవిడ్ కాకుండా అత్యవసర సేవలకు 108
ఆరోగ్య సమస్యలకు 14410
వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే 8297104104
జిల్లాల వారీగా కోవిడ్ కాల్‌సెంటర్ నంబర్లు
జిల్లా నంబరు
శ్రీకాకుళం 6300073203
విజయనగరం 08922–227950, 9494914971
విశాఖపట్నం 9666556597
తూర్పుగోదావరి 08842356196
పశ్చిమగోదావరి 18002331077
కృష్ణా 9491058200
గుంటూరు 08632271492
ప్రకాశం 7729803162
నెల్లూరు 9618232115
చిత్తూరు 9849902379
వైఎస్సార్ 08562–245259
అనంతపురం 08554–277434
కర్నూలు 9441300005