US President Biden Expresses Grief Over Odisha Train Accident - Sakshi
Sakshi News home page

తీవ్రంగా చలించిపోయా: బైడెన్‌

Jun 5 2023 5:12 AM | Updated on Jun 5 2023 8:52 AM

USA President Biden Expresses Grief Over Odisha Train Accident - Sakshi

వాషింగ్టన్‌: ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్‌ పేర్కొన్నారు. ‘భారత్‌లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్‌ బైడెన్‌ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము.

ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్‌ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్‌ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement