Mourning Conclusion
-
తీవ్రంగా చలించిపోయా: బైడెన్
వాషింగ్టన్: ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్ పేర్కొన్నారు. ‘భారత్‌లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్ బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి స్నేహితుడ్ని, అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక పోతున్నామన్నారు. రాష్ట్ర ఐ.టి.శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. ఆయన అకాలమరణం పార్టీకి తీరని లోటు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పేర్నినాని. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు. చాలా బాధాకరం: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ►మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త కలచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్థిస్తున్నాన్నారు. ►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం గౌతమ్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. ►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుడిలా గౌతమ్‌రెడ్డి ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పార్టీ, ప్రజలకు తీరని లోటన్నారు. ►మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నారాయణ్‌ఖేడ్ ఎన్నిక ఏకగ్రీవం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కిష్టారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. కిష్టారెడ్డి మృతి నేపథ్యంలో నిర్వహించే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సభదృష్టికి తెచ్చారు. ఆయన కుటుంబం నుంచి ఒకరు ఏకగ్రీవంగా సభకు వచ్చేలా సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని పక్షాల నేతలు సహకరించాలని కోరారు. ఇదే ఆయనకు సమర్పించే నివాళి అన్నారు. అయితే అంతకుముందు మాట్లాడిన సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం.. మాటమాత్రంగా కూడా ఈ విషయాన్ని పేర్కొనకపోవటం విశేషం. పార్టీ సభ్యులు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణలు కూడా ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై సీఎం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దశాబ్దాల అనుబంధం: సీఎం మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తనకు కిష్టారెడ్డితో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంద ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలున్న నేతగా కొనసాగారని, సభలో ఆవేశకావేశాలు ఏర్పడితే సర్దిచెప్పేం దుకు యత్నించే వారన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ.. తాను, కిష్టారెడ్డి ఒకేసారి సమితి అధ్యక్షులుగా ఎన్నికై, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని గుర్తుచేసుకున్నారు. ప్రతి విషయంలో పార్టీలకతీతంగా కిష్టారెడ్డి సూచనలు సలహాలు ఇచ్చేవారని టీడీఎల్పీ నేత దయాకరరావు అన్నారు. రాజకీయాల్లో షార్ట్‌కట్స్ ఉండవని, ప్రజల కోసం పనిచేస్తే ఎదుగుదల సాధ్యమని నిరూపించిన నేత కిష్టారెడ్టి అని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. వివాదరహితుడుగా రాజకీయ జీవితం గడిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మజ్లిస్, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. కిష్టారెడ్డికి సంతాపం వ్యక్తం చేసే సమయంలో గీతారెడ్డి భావేద్వేగానికి లోనయ్యారు. ఒకదశలో కన్నీళ్లు పెట్టుకుని, కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండిపోయారు. -
ఆంధ్రప్రదేశ్.. సారీ సారీ.. తెలంగాణ..
అసెంబ్లీలో తికమక పడిన ఎర్రబెల్లి టీఆర్ఎస్ సభ్యుల చురకలు సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. వెంటనే అధికార పక్ష సభ్యులు ఆయనకు చురకలంటించారు. దీంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి వెంటనే ’సారీ.. సారీ..’ అంటూ పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. బుధవారం అసెంబ్లీలో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంతాప తీర్మానంపై మాట్లాడే సందర్భంలో ‘కలాం వంటి వ్యక్తి ఈ సారి మన ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాలి’ అనగానే మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇంకా ఆంధ్ర వాసన వదిలినట్లు లేదు’ అని మరి కొందరు సభ్యులు ఎద్దేవా చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం.. తెలుగు వాడిగా పుట్టాలి అన్నది నా ఉద్దేశం. సారీ.. సారీ.. తెలంగాణలో పుట్టాలి’ అనడంతో అలజడి సద్దుమణిగింది.