ఆంధ్రప్రదేశ్.. సారీ సారీ.. తెలంగాణ.. | Assembly In The fall of confusion Yerrabelli | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్.. సారీ సారీ.. తెలంగాణ..

Published Thu, Sep 24 2015 1:30 AM | Last Updated on Mon, Aug 27 2018 8:19 PM

ఆంధ్రప్రదేశ్.. సారీ సారీ.. తెలంగాణ.. - Sakshi

ఆంధ్రప్రదేశ్.. సారీ సారీ.. తెలంగాణ..

అసెంబ్లీలో తికమక పడిన ఎర్రబెల్లి టీఆర్‌ఎస్ సభ్యుల చురకలు
సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీలో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. వెంటనే అధికార పక్ష సభ్యులు ఆయనకు చురకలంటించారు. దీంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి వెంటనే ’సారీ.. సారీ..’ అంటూ పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. బుధవారం అసెంబ్లీలో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంతాప తీర్మానంపై మాట్లాడే సందర్భంలో ‘కలాం వంటి వ్యక్తి ఈ సారి మన ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాలి’ అనగానే మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ఇంకా ఆంధ్ర వాసన వదిలినట్లు లేదు’ అని మరి కొందరు సభ్యులు ఎద్దేవా చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం.. తెలుగు వాడిగా పుట్టాలి అన్నది నా ఉద్దేశం. సారీ.. సారీ.. తెలంగాణలో పుట్టాలి’ అనడంతో అలజడి సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement