హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా తెలంగాణను ప్రభుత్వం మహారాష్ట్రకు తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, భారీగా పెంచిన వ్యయాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, భట్టి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. భట్టి మాట్లాడుతూ...ప్రభుత్వ సొంత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ. 86 వేల కోట్లకు పెంచారని విమర్శించారు.