ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు.
రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించ నున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్సను అందించనున్నట్టు ప్రకటించింది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్)
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్‌కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.
బాధితుల నష్టాన్ని పూడ్చలేం కానీ మరణించిన కుటుంబాలు ఈ విషాదం నుంచి కోలుకుని వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునేలా, ముందుకు నడిచేలా చేసేందుకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ లక్ష్యంతో 10-పాయింట్ల ప్రోగ్రామ్‌ను నీతా అంబానీ ప్రకటించారు. (ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్)
బాధితులకు అండగా పది పాయింట్ల ప్రోగ్రామ్
►గాయపడిన వారి తక్షణ కోలుకోవడానికి అవసరమైన మందులు, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య చికిత్స.
► విషాదం నుంచి కోలుకునేందుకు మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు.
►జియో, రిలయన్స్ రీటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలోని సభ్యునికి ఉపాధి అవకాశాలు
►వీల్‌చైర్లు, ప్రొస్థెసెస్‌తో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం.
►కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి బాధిత ప్రజలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ.
►తమ కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ , శిక్షణ అవకాశాలు.
►ప్రమాదంలో ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, కోడి వంటి పశువులను అందించడం.
►మరణించిన కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ
Comments
Please login to add a commentAdd a comment