ఆసియా బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు హుందాతనానికి, అటు ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, నృత్యకారిణిగా, పరోపకారిగా అన్నింటికీ మించి తల్లిగా నీతా అంబానీ ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకున్నారు. అన్ని విషయాల్లోనూ భర్త అంబానీతో ధీటుగా తనను తాను నిరూపించుకున్న సక్సెస్‌ఫుల్ ఉమన్ నీతా.
మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించిన నీతా చిన్నప్పటినుంచి భరతనాట్యంలో ప్రతిభావంతురాలైన కళాకారిణి రాణిస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పలు కుటుంబ వేడకుల సందర్బంగా డాన్స్‌తో ఆకట్టుకోవడం ఆమె స్టయిల్. తాజాగా నీతా అంబానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రదర్శన ఇస్తున్న ఫోటో ఒకటి ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
Music is a universal language that transcends boundaries and unites us all. This World Music Day, immerse yourself in the symphony of diverse sounds at the #NitaMukeshAmbaniCulturalCentre where every note and rhythm weaves a tapestry of mesmerising harmony. pic.twitter.com/fN3KDcnm3Y
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) June 21, 2023
నీతా అంబానీ భరతనాట్యం చేస్తున్న చిన్ననాటి చిత్రాలు చూస్తే అద్భుతం అనిపించకమానదు. సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేస్తున్న ఫోటో స్పెషల్‌గా ఉంది. తన రెండు చేతులను తన నడుముపై ఉంచి సూపర్ క్యూట్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. అలాగే మరో రెండు ఫోటోల్లో నీతా భారీ నటరాజ్ విగ్రహం ముందు పవర్ ప్యాక్ ప్రదర్శన కళ్లు తిప్పుకోలేని ఎక్స్‌ప్రెషన్స్ అమూల్యమైన ఫ్రేమ్‌లో అందంగా ఇమిడిపోయిన ఫోటోలు విశేషంగా నిలుస్తున్నాయి.
నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, టీచర్‌గా రూ. నెలకు 800 సంపాదించే వారట. ఆ తరువాత ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకుని అతిపెద్ద కుటుంబ వ్యాపారంలో చేరారు. రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ , ఐపీఎల్ క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ యజమానిగా ఉన్నారు.అంతేకాదు కళారంగానికి సేవాలనే ఉద్దేశంతో ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ఇటీవల లాంచ్ చేసినసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment