నీతా అంబానీ స్పెషల్‌ డైమండ్‌ వాచ్ చూశారా? ధర కోట్లలోనే | Do You Know Worth Of Nita Ambani Rose Gold Diamond Encrusted Patek Philippe Nautilus Watch - Sakshi
Sakshi News home page

Nita Ambani Watch Collection: నీతా అంబానీ స్పెషల్‌ డైమండ్‌ వాచ్ చూశారా? ధర కోట్లలోనే

Published Thu, Sep 14 2023 11:31 AM | Last Updated on Thu, Sep 14 2023 12:20 PM

Do know Worth of Nita Ambani Rose Gold Diamond Encrusted Patek Philippe Nautilus Watch - Sakshi

Nita Ambani Patek Philippe Nautilus Watchరిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, ఫ్యాషన్‌  ఐకాన్‌ నీతా అంబానీ సాంప్రదాయ లుక్‌తో పాటు,సామాజిక కార్యక్రమాలు,  అల్ట్రా- లగ్జరీ లైఫ్‌కి పెట్టింది పేరు. ఆమెకు సంబంధించి ఖరీదైన చీరలు,  నగలు, చెప్పులు, లిప్‌స్టిక్‌,హ్యాండ్‌బ్యాగ్స్‌ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక  ఉంటుంది. ఆసియా కుబేరుడు,  రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ  భార్యగానే కాదు, ఐపీఎల్‌ టీం ముంబై ఇండియన్స్‌కి  యజమానిగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక  చైర్‌ పర్సన్‌గా, పరోపకారిగా నీతా అంబానీ పాపులర్‌.   

నీతా అంబానీ  పటేక్ ఫిలిప్ నాటిలస్ వాచ్
ఆధునిక  ఫీచర్లతో  అద్భుతమైన డిజైన్‌తో నీతా అంబానీ   పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్  వాచ్‌  లేటెస్ట్‌ బజ్‌గా నిలిచింది.  18k రోజ్ గోల్డ్ కేస్ , మ్యాచింగ్ బ్రాస్‌లెట్‌తో  అందంగా కనిపిస్తోంది. చుట్టూ వజ్రాలు పొదిగిన పెర్ల్ డైమండ్-ఎంబెడెడ్ డయల్‌ స్పెషల్‌ లుక్‌ తీసుకొచ్చింది. గోల్డ్ ఒపలైన్ డయల్‌లో పాలిష్ చేసిన పింక్‌ హ్యాండ్స్‌, కౌంటర్లు కూడా ఉన్నాయి.  ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది.  జాకబ్ & కో ఫ్లూర్స్ డి జార్డిన్ టూర్‌బిల్లాన్ పింక్ సఫైర్స్ వాచ్‌ విలువ రూ. 4.6 కోట్లు, అలాగే పటేక్ ఫిలిప్ ఆక్వానాట్  రోజ్ గోల్డ్ వాచ్‌ ధర రూ. 3.2 కోట్లు.

ఇటీవల IPL మ్యాచ్‌లలో ఒకదానికి, నీతా అంబానీ తన IPL జట్టు ముంబై ఇండియన్స్‌  జెర్సీని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆమె చేతికి ఉన్న లగ్జరీ డైమండ్‌ వాచ్‌ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఖరీదైన బ్లూ కలర్ టాప్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పవచ్చు.  ఈ టాప్‌పై  బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన 'MI'మనం చూడొచ్చు. 

దీంతోపాటు Audemars Piguet రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ అమెథిస్ట్ డయల్ 26319OR వాచ్‌ ఖరీదు రూ. 3.1 కోట్లు. క్లీ డి కార్టియర్‌కు చెందిన మరో ఖరీదైన వాచ్‌ నీతా సొంతం.  ఈ వాచ్  18 క్యారెట్ గోల్డ్ అన్‌కట్ డైమండ్ బ్రాస్‌లెట్‌తో కూడిన రోజ్ కలర్ వాచ్. ఈ లగ్జరీ వాచ్‌లో ఫ్లింక్ సన్‌రే ఎఫెక్ట్ డయల్ అండ్ బ్లూ రోమన్ న్యూమరల్ అవర్ మార్కర్‌లు ఉన్నాయి. దీని ధర రూ.25 లక్షలకు పై మాటే. నీతా అంబానీ వాచ్ కలెక్షన్‌లో టాప్‌ -10   అత్యంత ఖరీదనవే కావడం విశేషం

ఇంకా డైమండ్‌ నెక్లెస్‌లు, హ్యాండ్‌బ్యాగులు, కార్లు ఇలా లగ్జరీ లైఫ్  స్థయిల్,కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ టాక్‌ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తారు. 1963 నవంబర్  1 న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల ఫోర్బ్స్ లిస్టులో  నీతా అంబానీ చోటు సంపాదించు కున్నారు. ఇటీవల నీతా ముఖాష్‌  అంబానీ  కల్చరల్‌సెంటర్‌(ఎన్‌ఎంఏసీసీ) ద్వారా భారతీయ కళలకు ప్రోత్సాహన్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement