diamond watch
-
నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్ చూశారా? ధర కోట్లలోనే
Nita Ambani Patek Philippe Nautilus Watchరిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ సాంప్రదాయ లుక్‌తో పాటు,సామాజిక కార్యక్రమాలు, అల్ట్రా- లగ్జరీ లైఫ్‌కి పెట్టింది పేరు. ఆమెకు సంబంధించి ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు, లిప్‌స్టిక్,హ్యాండ్‌బ్యాగ్స్ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌కి యజమానిగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక చైర్ పర్సన్‌గా, పరోపకారిగా నీతా అంబానీ పాపులర్. నీతా అంబానీ పటేక్ ఫిలిప్ నాటిలస్ వాచ్ ఆధునిక ఫీచర్లతో అద్భుతమైన డిజైన్‌తో నీతా అంబానీ పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్ వాచ్ లేటెస్ట్ బజ్‌గా నిలిచింది. 18k రోజ్ గోల్డ్ కేస్ , మ్యాచింగ్ బ్రాస్లెట్తో అందంగా కనిపిస్తోంది. చుట్టూ వజ్రాలు పొదిగిన పెర్ల్ డైమండ్-ఎంబెడెడ్ డయల్ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. గోల్డ్ ఒపలైన్ డయల్‌లో పాలిష్ చేసిన పింక్ హ్యాండ్స్, కౌంటర్లు కూడా ఉన్నాయి. ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది. జాకబ్ & కో ఫ్లూర్స్ డి జార్డిన్ టూర్‌బిల్లాన్ పింక్ సఫైర్స్ వాచ్ విలువ రూ. 4.6 కోట్లు, అలాగే పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ రోజ్ గోల్డ్ వాచ్ ధర రూ. 3.2 కోట్లు. ఇటీవల IPL మ్యాచ్‌లలో ఒకదానికి, నీతా అంబానీ తన IPL జట్టు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆమె చేతికి ఉన్న లగ్జరీ డైమండ్ వాచ్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఖరీదైన బ్లూ కలర్ టాప్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ టాప్‌పై బంగారంతో ఎంబ్రాయిడరీ చేసిన 'MI'మనం చూడొచ్చు. దీంతోపాటు Audemars Piguet రాయల్ ఓక్ క్రోనోగ్రాఫ్ అమెథిస్ట్ డయల్ 26319OR వాచ్ ఖరీదు రూ. 3.1 కోట్లు. క్లీ డి కార్టియర్‌కు చెందిన మరో ఖరీదైన వాచ్ నీతా సొంతం. ఈ వాచ్ 18 క్యారెట్ గోల్డ్ అన్‌కట్ డైమండ్ బ్రాస్లెట్తో కూడిన రోజ్ కలర్ వాచ్. ఈ లగ్జరీ వాచ్‌లో ఫ్లింక్ సన్‌రే ఎఫెక్ట్ డయల్ అండ్ బ్లూ రోమన్ న్యూమరల్ అవర్ మార్కర్లు ఉన్నాయి. దీని ధర రూ.25 లక్షలకు పై మాటే. నీతా అంబానీ వాచ్ కలెక్షన్లో టాప్ -10 అత్యంత ఖరీదనవే కావడం విశేషం ఇంకా డైమండ్ నెక్లెస్‌లు, హ్యాండ్‌బ్యాగులు, కార్లు ఇలా లగ్జరీ లైఫ్ స్థయిల్,కాస్ట్లీ వస్తువుల కలెక్షన్ తో ఎప్పుడూ టాక్ఆఫ్ది టౌన్‌గా నిలుస్తారు. 1963 నవంబర్ 1 న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల ఫోర్బ్స్ లిస్టులో నీతా అంబానీ చోటు సంపాదించు కున్నారు. ఇటీవల నీతా ముఖాష్ అంబానీ కల్చరల్సెంటర్(ఎన్ఎంఏసీసీ) ద్వారా భారతీయ కళలకు ప్రోత్సాహన్నిస్తున్నారు. -
ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్‌ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్‌ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్‌లోని డోర్చెస్టర్ హోటల్లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్‌ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్‌కు ఇచ్చానని పేర్కొన్నాడు. పటౌడీ ప్యాలెస్ కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్‌ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్‌కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్‌లు , డైనింగ్ రూమ్‌లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు. -
ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు
బేసెల్: కాంతులీనే శ్వేతవర్ణ వజ్రాలు పొదిగిన ఈ గడియారం విలువ తెలిస్తే నిజంగా కళ్లు తిరుగుతాయి. 152 క్యారెట్ల వజ్రాలతో రూపొందించిన దీని విలువ అక్షరాల 250 కోట్ల రూపాయలు. లండన్‌కు చెందిన ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ‘గ్రాఫ్’ దీన్ని స్విట్జర్టాండ్లోని బేసెల్‌లో జరుగుతున్న ప్రపంచస్థాయి వజ్రాల నగల ప్రదర్శనలో అమ్మకానికి పెట్టింది. ‘ది ఫాసినేషన్’ పేరిట పిలుస్తున్న ఈ గడియారాన్ని చేతితోపాటు మెడకు నెక్లెస్ లాకెట్‌లా కూడా ధరించేలా తయారు చేశారు. దీని తయారీకి కొన్ని వేల గంటల సమయం పట్టిందని గ్రాఫ్ వజ్రాల కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ లారెన్స్ గ్రాఫ్ తెలిపారు. ‘వజ్రాలే ఆడవారికి అందమైన మిత్రుల’నే అలనాటి హాలివుడ్ అందాల తార మార్లిన్ మన్రో మాటలను నమ్మినవారు ధరకు వెరవకుండా ఈ గడియారాన్ని చేజిక్కించుకోవచ్చు!