రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్‌ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)
లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు.
అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్‌ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్‌లోని డోర్చెస్టర్ హోటల్‌లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ )
దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్‌ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్‌కు ఇచ్చానని పేర్కొన్నాడు.
పటౌడీ ప్యాలెస్
కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్‌ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్‌కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్‌రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్‌లు , డైనింగ్ రూమ్‌లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment