మాంచెస్టర్: ఆ్రస్టేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 384 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 67 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓపెనర్ జాక్ క్రాలీ (182 బంతుల్లో 189; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆసీస్ బౌలర్ల భరతంపట్టి త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మొయిన్ అలీ (82 బంతుల్లో 54; 7 ఫోర్లు), జో రూట్ (95 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (14 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 299/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 18 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయి 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లు... బ్రాడ్ 2 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment