రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. యాష్ (5/51).. ఇంగ్లండ్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్‌కు కుల్దీప్ యాదవ్ (4/22) తోడవ్వడంతో ఇంగ్లండ్ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది.
రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ కలుపుకుని ఇంగ్లండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment