రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 152 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.
అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
And just like Ravichandran Ashwin started the innings,he ends it with a wicket as he gets yet another 5 wicket haul which gets him equal to the most with Anil Kumble(35th) ❤️🔥 a MODERN DAY LEGEND !!! #INDvENG • #Ashwin • #INDvsENG
— ishaan (@ixxcric) February 25, 2024
pic.twitter.com/iUWkXuKRQr
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు.
Two Wickets in the Over for Ravichandran Ashwin. pic.twitter.com/7bDGwD1L2x
— CricketGully (@thecricketgully) February 25, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
MOST WICKETS IN TESTS IN INDIA...!!!!
— Johns. (@CricCrazyJohns) February 25, 2024
- One & only Ravichandran Ashwin. 🫡🇮🇳pic.twitter.com/R9ov9nk8za
Comments
Please login to add a commentAdd a comment