పార్థీవ్కు లైన్ క్లియర్ | Parthiv patel set to play Mumbai Test | Sakshi
Sakshi News home page

పార్థీవ్కు లైన్ క్లియర్

Published Tue, Dec 6 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

పార్థీవ్కు లైన్ క్లియర్

పార్థీవ్కు లైన్ క్లియర్

ముంబై: మరో రెండు రోజుల్లో నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్తో ఆరంభం కానున్న నాల్గో టెస్టులో భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఆడేందుకు లైన్ క్లియరైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ను నాల్గో టెస్టులో ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు. మొహాలీలో మూడో టెస్టుకు ముందు సాహా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో అనూహ్యంగా పార్థీవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు.

 

తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జట్టులో పునరాగమనం చేసిన పార్థీవ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నాల్గో టెస్టులో ఆడనున్నాడు. అతను గాయం నుంచి తిరిగి కోలుకోవడంతో జట్టులో ఎంపికయ్యాడు. నాల్గో టెస్టులో మురళీ విజయ్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ క్రమంలోనే పార్థీవ్ టాపార్డర్లో  బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

మరొకవైపు పేసర్ ఇషాంత్ శర్మను జట్టు స్వ్కాడ్ నుంచి విడుదల చేశారు.డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. వారణాసికి చెందిన ప్రతీమా సింగ్తో ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. ఆ నేపథ్యంలో ఇషాంత్ కు విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement