రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ రెండు భారీ మైలురాళ్లపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ మరో 23 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 4000 పరుగుల మార్కును చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో ఏడు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం రోహిత్ 57 టెస్ట్‌ల్లో 45.2 సగటున 3978 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఖాతాలో 11 టెస్ట్ శతకాలు, 16 అర్దశతకాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో రోహిత్ 470 మ్యాచ్‌లు ఆడి 593 సిక్సర్లు బాదాడు.
కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో (మూడు మ్యాచ్‌ల అనంతరం) కొనసాగుతుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో, రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా వరుస విజయాలు సాధించింది.
ఈ సిరీస్‌కు సంబంధించి రోహిత్ స్కోర్ల విషయానికొస్తే.. హిట్‌మ్యాన్ 6 ఇన్నింగ్స్‌లు ఆడి 40 సగటున సెంచరీ సాయంతో 240 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ సహచర ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. యశస్వి ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 109 సగటున రెండు డబుల్ సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 545 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment